ముగ్గురు డబుల్ సెంచరీ వీరులు.. ఓకే ఫ్రేమ్ లో?

praveen
ఇటీవల కాలంలో టీమ్ ఇండియా జట్టులో స్థానం దక్కించుకున్న యువ ఆటగాళ్లందరూ తమ ప్రదర్శనతో ఆకట్టుకుంటూ ఉన్నారు అని చెప్పాలి . ఈ క్రమంలోనే మొన్నటికి మొన్న ఇషాన్ కిషన్ వచ్చిన ఒక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని డబుల్ సెంచరీ తో చెలరేగిపోయాడు. ఇక ఇటీవల న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్లో కూడా అటు వరుసగా రెండు సెంచరీలు నమోదు చేసిన శుభమన్ గిల్ ఇక రెండో సెంచరీని డబుల్ సెంచరీగా మార్చి అభిమానులందరినీ కూడా సంతోషంలో ముంచేసాడు అని చెప్పాలి.

 అయితే ప్రపంచ క్రికెట్లో ఇలా వన్డే ఫార్మాట్లో డబుల్ సెంచరీ సాధించిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. ఎంతోమంది స్టార్ ప్లేయర్లు ఉన్నప్పటికీ కొంతమందికి మాత్రమే డబుల్ సెంచరీ రికార్డు సాధ్యమైంది. అయితే ఇలా డబుల్ సెంచరీ సాధించిన వారిలో భారత జట్టు నుంచే ఎక్కువ మంది ఉండడం గమనార్హం. ఇకపోతే గతంలో కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఏకంగా మూడుసార్లు డబుల్ సెంచరీ రికార్డును సాధించాడు అని చెప్పాలి. ఇక ఆ తర్వాత ఇషాన్ కిషన్ ఇక ఇటీవల శుభమన్ గిల్ కూడా ఇలాంటి రికార్డు సాధించారు. అయితే ఇలా డబుల్ సెంచరీ సాధించిన వీరులందరూ ఒకే ఫ్రేమ్ లో కనిపిస్తే ఆ ఫోటో అభిమానుల దృష్టిని ఆకర్షించడం ఖాయం అని చెప్పాలి.

 ఇటీవల ఇదే జరిగింది. హైదరాబాదులోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్లో విజయం సాధించిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మ యువ ఆటగాళ్లు డబుల్ సెంచరీ వీరులు అయిన ఇషాన్ కిషన్ శుభమన్ గిల్ లతో ఒక సరదా ఇంటర్వ్యూ చేశాడు. ఈ వీడియోని అటు బీసీసీఐ ట్విట్టర్ వేదికగా షేర్ చేసింది అని చెప్పాలి. ఇక ఈ వీడియో కాస్త ప్రస్తుతం వైరల్ గా మారిపోయింది. ఈ సందర్భంగా ఇక ఇద్దరు యువ ఆటగాల్లను ఆసక్తికర ప్రశ్నలు అడిగి ఫన్నీ సమాధానాలు రాబట్టాడు రోహిత్ శర్మ. ఏది ఏమైనా ముగ్గురు డబుల్ సెంచరీ వీరులను ఒకే ఫ్రేమ్ లో చూసి అభిమానులు మురిసిపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: