కెప్టెన్ గా మారిన.. కోచ్ రాహుల్ ద్రవిడ్ కొడుకు?

praveen
ఇటీవల కాలంలో ఏ రంగంలో అయినా వారసులదే హవా ఎక్కువగా నడుస్తూ ఉంది అన్న విషయం తెలిసిందే. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతూ ఇక సీనియర్ హీరోలుగా మారిపోయిన వారు ఆ తర్వాత కాలంలో వారి కొడుకులను ఇక ఇండస్ట్రీకి హీరోలుగా పరిచయం చేయడం ఇక అన్ని విషయాల్లో వారికి వెన్నుదన్నుగా నిలవడం లాంటివి చేస్తున్నారు. ఇలా బ్యాగ్రౌండ్తో వారసులుగా వచ్చినవాళ్లు స్టార్ హీరోలుగా మారిపోవడం చూస్తూనే ఉన్నామ్. ఇక రాజకీయాల్లో సైతం ఇలా ఒక పదవిలో కొనసాగుతున్న వారి వారసులు ఇక రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి రాణిస్తూ ఉన్నారు.

 అయితే కేవలం సినిమాలు రాజకీయాల్లోనే కాదు క్రీడారంగంలో కూడా ఇక ఇలాంటి వారసత్వం కొనసాగుతుంది అని చెప్పాలి. ఒకప్పుడు ఆయా క్రీడలలో రాణించి ఇక స్టార్ ప్లేయర్లుగా ఎదిగిన వారు ఇక వారు రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మాత్రం వారి వారసులను ఇక అదే క్రీడారంగానికి పరిచయం చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. ఇక ఇప్పుడు భారత క్రికెట్లో లెజెండరీ క్రికెటర్ గా కొనసాగుతున్న రాహుల్ ద్రవిడ్ సైతం ఇదే చేస్తున్నాడు. దాదాపు దశాబ్ద కాలానికి పైగానే టీమిండియా కు ప్రాతినిధ్యం వహించాడు రాహుల్ ద్రావిడ్.

 ఇక తన ఆట తీరుతో ఎన్నో మరుపురాని విజయాలు అందించడమే కాదు ప్రపంచ రికార్డులు కూడా కొలగొట్టాడు. ఇక ఇప్పుడు రాహుల్ ద్రావిడ్ కొడుకు ఇలా ప్రపంచ క్రికెట్లో రాణించేందుకు ఇప్పటినుంచి సన్నదమవుతున్నాడు. ఇకపోతే తండ్రి లాగే క్రికెట్లో రాణిస్తున్నాడు కర్ణాటక అండర్ 14 క్రికెట్ టీం కెప్టెన్ గా రాహుల్ ద్రావిడ్ కొడుకు అన్వాయ్ ద్రవిడ్ ఎంపికయ్యాడు. కేరళలో జరగనున్న ఇంటర్ జోనల్ టోర్నీ లో జట్టుకు సారధ్యం వహించబోతున్నాడు. గతంలో అన్వయ్ అన్నయ్య ద్రవిడ్ పెద్దకొడుకు సమీత్ ద్రవిడ్ సైతం కర్ణాటక అండర్ 14 జట్టుకు కెప్టెన్గా వ్యవహరించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: