రంజి క్రికెట్ చరిత్రలో.. 74 ఏళ్ల రికార్డ్ బ్రేక్?

praveen
ప్రస్తుతం టీమిండియాలో చోటు దక్కని సీనియర్ ఆటగాళ్లు.. అదే సమయంలో టీమిండియాలో చోటు దక్కించుకోవాలనుకున్న యువ ఆటగాళ్లు అందరూ కలిసి రంజీ ట్రోఫీలో ఆడుతున్నారు అన్న విషయం తెలిసిందే. ఇక రంజి ట్రోఫీలో భాగంగా తమ సత్తా ఏంటో చూపిస్తూ మరోసారి అదరగొడుతున్నారు అని చెప్పాలి. బౌలర్లు వైవిద్యమైన బంతులతో వికెట్లు పడగొడుతూ ఉంటే అటు బ్యాట్స్మెన్లు సెంచరీలతో చెలరేగిపోతున్నారు అని చెప్పాలి. దీంతో ఇక రంజి ట్రోఫీలో ఆటగాళ్ల ప్రదర్శనకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతున్నాయి.

 ఇక ఇటీవల కాలంలో ప్రతి జట్టు కూడా రంజీ ట్రోఫీలో మంచి ప్రదర్శన చేస్తూ ఇక భారీ స్కోర్లు నమోదు చేస్తూ సరికొత్త రికార్డులు సృష్టిస్తూ ఉన్నారు. అదే సమయంలో కొన్ని జట్లు ఇక తక్కువ స్కోర్  చేసినప్పటికీ తమ బౌలింగ్ బలంతో ప్రత్యర్థిని మట్టి కరిపించటం..  ఇక ఆ తక్కువ స్కోరనే కాపాడుకోవడం లాంటివి కూడా చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. తద్వారా ఇక రంజీ ట్రోఫీలో ఎన్నో రికార్డులు బద్దలౌతున్నాయ్. రంజీ చరిత్రలో 74 ఏళ్ళ రికార్డు బద్దలైంది అని చెప్పాలి. రంజీ ట్రోఫీ చరిత్రలోనే అత్యల్ప స్కోరును కాపాడుకున్న జట్టుగా విదర్భ అవతరించింది. అరుదైన రికార్డును సృష్టించింది.

 ఇటీవల రంజీ ట్రోఫీలో భాగంగా తొలి విదర్భ గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది అని చెప్పాలి. ఈ క్రమంలోనే విదర్భ తొలి ఇన్నింగ్స్ లో 74 పరుగులు మాత్రమే చేసింది. ఆ సమయంలో ఇక మొదటి ఇన్నింగ్స్ ఆడిన గుజరాత్ జట్టు 256 పరుగులకు ఆల్ అవుట్ అయింది అని చెప్పాలి. అయితే 182  పరుగులతో ఆదిఖ్యాన్ని సాధించింది గుజరాత్ జట్టు. అయితే రెండవ ఇన్నింగ్స్ లో విదర్భ 254 పరుగులు చేసి పర్వాలేదు అనిపించింది. ఇక ఆ తర్వాత గుజరాత్ జట్టు కేవలం 73 పరుగులు స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగింది. అయితే విదర్భ జట్టు బౌలింగ్ విభాగం పట్టు బిగించడంతో గుజరాత్ 54 పరుగులకే కుప్పకూలిపోయింది. దీంతో తక్కువ పరుగులను కాపాడుకొని విజయం సాధించింది. 1949 లో బీహార్ జట్టు 78 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: