అశ్విన్ చెప్పింది బానే ఉంది.. కానీ మన చేతుల్లో లేదు : రోహిత్

praveen
ఈ ఏడాది భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ వరల్డ్ కప్ లో భాగంగా ఆతిథ్య భారత జట్టు ఇక టైటిల్ గెడవలమే లక్ష్యంగా బరిలోకి దిగబోతుంది. ఈ క్రమంలోనే ఇక ప్రస్తుతం ఎక్కడ చూసినా కూడా వన్డే వరల్డ్ కప్ కు సంబంధించిన చర్చ జరుగుతూ ఉంది అని చెప్పాలి. ఎంతోమంది మాజీ క్రికెటర్లు అందరూ కూడా ఈ విషయంపై చర్చించుకుంటూ ఇక తమ అభిప్రాయాలను కూడా సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తూ ఉన్నారు. అయితే ఇటీవల రవిచంద్రన్ అశ్విన్ సైతం ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు.

 సాధారణంగా వన్డే మ్యాచ్లను మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ప్రారంభిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ఈ సమయాన్ని ఉదయం 11:30 గంటలకు మారిస్తే బాగుంటుందని రవిచంద్రన్ అశ్విన్ అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు మ్యాచ్ ప్రారంభిస్తే పిచ్ పై మంచుచేరి ఇక కాస్త స్లో అవుతుందని.. అప్పుడు లక్ష్య చేదన చేస్తున్న జట్టుకే ఎక్కువగా గెలిచే అవకాశాలు ఉంటాయి అంటూ వ్యాఖ్యానించాడు. అయితే ఇటీవలే మీడియా సమావేశంలో కెప్టెన్ రోహిత్ శర్మ సైతం ఇదే విషయంపై మాట్లాడాడు.

 అశ్విన్ చెప్పినట్లుగా అతని ఆలోచన మంచిదే. అయితే టాస్ మీద ఎక్కువగా ఆధారపడకుండా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఇది సాదాసీదా మ్యాచ్ కాదు.. ప్రపంచ కప్. కాస్త ముందుగానే మ్యాచ్ను ప్రారంభించాలనే ఆలోచన నాకు నచ్చింది అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. అయితే ఇక ఇలా మ్యాచ్ టైమింగ్స్ మార్చడం సాధ్యమవుతుందా లేదా అన్నది మాత్రం నాకైతే తెలియదు అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు. ప్రసార కార్యకర్తలు దానిని నిర్ణయిస్తారు అంటూ సమాధానం చెప్పాడు. మంచుతో కూడిన పరిస్థితుల్లో బ్యాటింగ్ అడ్వాంటేజ్ లేకుండా నాణ్యమైన క్రికెట్ ఆడాలని కోరుకోవాలి. అయితే ఇవన్నీ మన కంట్రోల్ లో ఉండవు మ్యాచ్ను ముందుగా ప్రారంభించాలనే ఆలోచన మాత్రం నాకు నచ్చింది అంటూ రోహిత్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: