IND vs NZ 1st ODI: గ్రౌండ్ లోకి వస్తే కఠిన చర్యలే?

Purushottham Vinay
ఇక శ్రీలంకతో చాలా భారీ విజయం సాధించింది టీమిండియా. ఆ సిరీస్ ని టీమిండియా చాలా ఘనంగా ఎన్నో రికార్డులతో సొంతం చేసుకుంది. ఇక ఆ మ్యాచ్ లు చూసి పండుగలు చేసుకున్న అభిమానులకు రేపు న్యూజిలాండ్ తో జరిగే మ్యాచ్ లో మరో పండుగ మొదలవుతుంది. రేపు హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో రేపు టీమిండియాకి ఇంకా అలాగే న్యూజిలాండ్ కి మధ్య వన్డే మ్యాచ్ జరగనుంది. ఈ మేరకు అక్కడ హైదరాబాద్ పోలీసులు చాలా భారీ ఏర్పాట్లని చేశారు.ఇక ఇందుకోసం గాను దాదాపు మొత్తం 2500 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేశామని రాచకొండ సీపీ డీసీ చౌహన్ తెలిపారు. మంగళవారం నాడు ఆయన మాట్లాడుతూ, వన్డే మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అనేవి ఖచ్చితంగా ఉంటాయని, బుధవారం నాడు మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రేక్షకులను స్టేడియం లోపలికి ఎంట్రీ చేస్తామని ఆయన తెలిపారు.


ఇంకా అలాగే ఆటగాళ్లతో పాటు ప్రేక్షకులకు ఈసారి ఎలాంటి ఇబ్బందులు అనేవి కూడా లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇక ఇందుకోసం గాను ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లు కూడా అక్కడ ఏర్పాటు చేశారు. ప్లేయర్స్ వచ్చే గేట్ నుంచి ఎవరికీ కూడా అనుమతి ఉండదని సీపీ తెలిపారు. ఇక రూల్స్ ని అతిక్రమించి, ఎవరైనా కానీ మైదానంలోకి వెళ్తే మాత్రం .. ఖచ్చితంగా చాలా కఠిన శిక్షలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఇంకా అలాగే మహిళా అభిమానుల కోసం కూడా ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. ఇక లేడీస్‌తో తప్పుగా ప్రవర్తిస్తే తప్పకుండా కఠిన చర్యలు ఉంటాయన్నారు.అయితే టికెట్ల విషయంలో అస్సలు మోసపోవద్దని, బ్లాక్ టికెట్స్ అమ్మితే ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు. ఇప్పటికే బ్లాక్ టికెట్స్ మోసాలపై మొత్తం 3 కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు. ఇంకా గేట్ నెంబర్ 1 నుంచి వీఐపీలకు మాత్రమే అనుమతి ఉందని ఆయన పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: