IND vs NZ: రేపే స్టార్ట్.. రికార్డులు రిపీట్ అవుతాయా?

Purushottham Vinay
ఇండియా-న్యూజిలాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జనవరి 18 వ తేదీన అంటే రేపు తొలి మ్యాచ్ జరగనుంది.ఇక హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో రెండు టీంల మధ్య ఈ మ్యాచ్ అనేది జరగనుంది. ఇక ఇప్పటికే టీమిండియాతోపాటు కివీస్ జట్టు ఇప్పటికే హైదరాబాద్ చేరుకున్నాయి. ఈ వన్డే సిరీస్‌లో రెండు జట్ల మధ్య ఆసక్తికరమైన మ్యాచ్ జరగనుంది. భారత్ ఇంకా న్యూజిలాండ్ తమ చివరి వన్డే సిరీస్‌ను గెలుచుకుని ఇందులో బరిలోకి దిగనున్నాయి. ఇక పాకిస్థాన్ పర్యటనలో, కివీస్ వన్డే సిరీస్‌లో ఆతిథ్య జట్టును 2-1తో ఓడించడం జరిగింది.ఇంకా అదే సమయంలో వన్డే సిరీస్‌లో ఇండియా 3-0తో శ్రీలంకను ఓడించింది. న్యూజిలాండ్ టీం తొలిసారి హైదరాబాద్ వేదికగా వన్డే మ్యాచ్ ని ఆడనుంది. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఇండియా వన్డే మ్యాచ్ పెర్ఫార్మన్స్ విషయానికి వస్తే..హైదరాబాద్‌లో జరిగిన వన్డేల్లో ఇండియా క్రికెట్ టీం 50 శాతం విజయం సాధించింది. గత 12 సంవత్సరాలుగా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో టీమిండియా విజయవంతంగా ఉంది.


అయితే 2009 నవంబర్ 5న ఈ మైదానంలో జరిగిన చివరి వన్డేలో ఇండియా ఓడిపోయింది. ఇంకా ఆ తర్వాత ఆస్ట్రేలియా చేతిలో 3 పరుగుల తేడాతో ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత టీమ్ ఇండియా ఇక్కడ మొత్తం మూడు మ్యాచ్‌లు ఆడింది. ఈ టైంలో ఇంగ్లండ్, శ్రీలంక, ఆస్ట్రేలియాలపై భారత్ విజయం సాధించింది. గతంలో 2005 నుంచి 2009 దాకా హైదరాబాద్‌లో ఇండియా ఒకసారి దక్షిణాఫ్రికా చేతిలో ఇంకా రెండుసార్లు ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. అదేమిటంటే హైదరాబాద్‌లో జరిగిన ఫస్ట్ మూడు వన్డేల్లో ఇండియా టీం విజయం సాధించలేకపోయింది. రాజీవ్ గాంధీ స్టేడియంలో ఇప్పటి దాకా మొత్తం ఆరు వన్డేలు ఆడగా, అందులో ఇండియా మూడు గెలిచి మూడింటిలో ఓడిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: