సూర్యకు బదులు.. అతన్ని తీసుకోవాల్సింది : ఆకాష్ చోప్రా

praveen
దాదాపు గత కొన్నేళ్ల నుంచి కూడా దేశవాళి క్రికెట్లో అద్భుతమైన ప్రస్తానాన్ని కొనసాగిస్తున్నాడు యువ ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్. ఈ ప్రతి మ్యాచ్ లో కూడా సెంచరీ చేయడమే లక్ష్యంగా బరిలోకి దిగుతూ ఇక బ్యాటింగ్ విధ్వంశాన్ని కొనసాగిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ముంబై జట్టుకు ప్రాతినిధ్యం భాగిస్తూ  ఇక జట్టు విజయంలో కీలక పాత్ర వహిస్తున్నాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే సాధారణంగా దేశవాళి క్రికెట్లో మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్ను ఇక సెలక్టర్లు వెంటనే భారత జట్టులోకి తీసుకోవడం ఇటీవల కాలంలో చూస్తూ ఉన్నాం.

 అయితే ఇక ఇలా భారత జట్టులో అవకాశం దక్కించుకున్న ఎంతోమంది యువ ఆటగాళ్లు అంతర్జాతీయ క్రికెట్ లో కూడా తమ సత్తా చాటి ఇక తమ స్థానాన్ని స్వస్తిరం చేసుకుంటున్నారు. కానీ కొన్ని నెలల నుంచి సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ క్రికెట్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తూ ఉన్నప్పటికీ కూడా అతని విషయంలో అటు టీమిండియా కలెక్టర్లు వివక్షపూరితంగానే వ్యవహరిస్తున్నారు. దీంతో ఇక భారత జట్టు తరఫున అరంగేట్రం చేయాలని కోరిక అతనికి తీరడం లేదు అని చెప్పాలి.

 ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్ కు సర్ఫరాజ్ ఖాన్ కు తప్పక జట్టులో చోటు దక్కుతుందని అందరూ భావించారు. కానీ చివరికి నిరాశ ఎదురయింది అని చెప్పాలి. ఇక ఇదే విషయంపై స్పందిస్తున్న ఎంతో మంది మాజీ ఆటగాళ్లు సూర్యకుమార్కు బదులు అటు సర్ఫరాజ్ ఖాన్ కు జట్టులో స్థానం కల్పించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడుతున్నారు. ఇక భారత మాజీ క్రికెటర్ ఆకాష్ చోప్రా సైతం ఇదే చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఫస్ట్ క్లాస్ క్రికెట్లో బ్రాడ్ మాన్ తర్వాత హైయెస్ట్ యావరేజ్ కలిగిన సర్ఫరాజ్ ఖాన్ ను జట్టులోకి తీసుకొని ఉంటే బాగుండేది. సూర్యకుమార్ స్థానంలో అతన్ని ఎంపిక చేయాల్సింది అంటూ ఆకాష్ చోప్రా అభిప్రాయపడ్డాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: