అదరగొట్టిన కోహ్లీ టీమ్ మేట్.. 7 ఫోర్లు, 8 సిక్సర్లతో?

praveen
బిసిసిఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ మాదిరిగానే అటు సౌత్ ఆఫ్రికా క్రికెట్ బోర్డు కూడా ఇటీవల కొత్తగా టీ20 లీగ్ ప్రారంభించింది అన్న విషయం తెలిసిందే. ఇక ఇటీవల ప్రారంభమైన టి20 లీగ్ లో ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగానే సాగుతుంది. అయితే ఇక ఐపీఎల్ లో ఫ్రాంచైజీల తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న ఆటగాళ్లు అటు సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో కూడా ఆయా జట్లలో భాగం అయ్యారు అని చెప్పాలి. అంతేకాదు ఇక ఐపీఎల్ ఫ్రాంచైజీ లే అటు సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో జట్లను కొనుగోలు చేయడం గమనార్హం.

 ఐపీఎల్ లో 2023 లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న వీల్ జాక్స్ అటు సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో భాగంగా అదిరిపోయే ప్రదర్శన చేసి ఆకట్టుకుంటున్నాడు. ఇటీవల సన్రైజర్స్ ఈస్టర్ను కేఫ్ తో జరిగిన మ్యాచ్ లో మెరుపు ఇన్నింగ్స్ ఆడి అదరగొట్టాడు అని చెప్పాలి. ప్రస్తుతం విల్ జాక్స్ ప్రిటోరియ క్యాపిటల్స్ కి ప్రాతినిధ్యం  వహిస్తున్నాడు. ఇటీవల   జరిగిన మ్యాచ్లో టాస్ ఓడి తొలుత  బ్యాటింగ్ దిగింది ప్రిటోరియ క్యాపిటల్స్ జట్టు. ఈ క్రమంలోనె ఓపెనర్ గా బరిలోకి దిగిన విల్ జాక్స్ 92 పరుగులు చేసి మంచి ఆరంభాన్ని అందించాడు.

 మరోవైపు సాల్ట్ (1) రోసేవ్ (20) పరుగులు చేసి తక్కువ పరుగులకే వికెట్ కోల్పోయిన సమయంలో ఇక జట్టును కష్టాల నుంచి గట్టెక్కించాడు వీల్ జాక్స్. ఇక బ్రుయన్ 42 పరుగులతో మూడో ఇన్నింగ్స్ కి 111 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనె హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్లో భాగంగా మొత్తంగా 46 బంతులు ఎదుర్కొన్న జాక్స్ 7 ఫోర్లు, 8 సిక్సర్ల  సహాయంతో 92 పరుగులు చేసి ఏకంగా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రిటోరియా క్యాపిటల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 216 పరుగులు చేసింది.  అయితే ఆ తర్వాత భారీ లక్ష్య చేదన కోసం బరిలోకి దిగిన సన్రైజర్స్ జట్టు వరుసగా వికెట్లు కోల్పోవడంతో చివరికి 37 పరుగుల తేడాతో ఓటమిపాలైంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: