5వ స్థానంలో బ్యాటింగ్ పై.. కేఎల్ రాహుల్ ఏమన్నాడంటే?

praveen
సాదరణంగా ఏ క్రికెట్ జట్టులో అయినా సరే ఒక స్థానంలో బ్యాటింగ్ చేస్తున్న ఆటగాడు ప్రతి మ్యాచ్ లో కూడా అదే స్థానంలో బ్యాటింగ్ దిగడం లాంటివి చేస్తూ ఉంటాడు. టీమ్ ఇండియాలో మాత్రం గత కొంతకాలం నుంచి ఏ ఆటగాడు ఏ స్థానంలో బాటింగ్ చేయడానికి వస్తాడు అన్నది ఊహకంగానే మారిపోయింది అని చెప్పాలి. ముఖ్యంగా కేఎల్ రాహుల్ రాకుండా కొంతకాలం నుంచి తన బ్యాటింగ్ స్థానం మార్చుకుంటూ ఉండటం గమనార్హం. మొన్నటి వరకు భారత జట్టుకు వైస్ కెప్టెన్ గా కొనసాగిన కేఎల్ రాహుల్ ఇక కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనర్ గా బరిలోకి దిగాడు. కేఎల్ రాహుల్ ఓపెనర్ గా ఇండియాకు ఎన్నో మంచి ఆరంభాలు అందించాడు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 అయితే గత కొంతకాలం నుంచి మాత్రం చేయాలి ఓపెనర్ గా  విఫలం అవుతూ వస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. అదే సమయంలో ఇక అడపాదప అవకాశాలు దక్కించుకుంటున్న యువ ఆటగాళ్లు మాత్రం ఓపెనర్ గా దంచి కొడుతున్నారు.. ఈ నేపథ్యంలోనే రోహిత్ శర్మతో పాటు ఓపెనింగ్ చేసేందుకు యువ ఆటగాళ్లకు అవకాశం కల్పిస్తూ ఇక కేఎల్ రాహుల్ను అయిదవ స్థానంలో బ్యాటింగ్కు దింపుతున్నారు  ఐదవ స్థానంలో వస్తూ ఒత్తిడిని తట్టుకుంటూ మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు  కేఎల్ రాహుల్.

 అయితే ఇలా ఓపెనర్ నుంచి ఒక్కసారిగా మిడిల్ ఆర్డర్ లోకి తన బ్యాటింగ్ స్థానం మారిపోవడం గురించి ఇటీవల కేఎల్ రాహుల్ స్పందించాడు. మిడిల్ ఆర్డర్లో రావడం వల్ల స్పిన్ ఎటాక్ ను ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఇక బంతి పైకి వస్తుంటే ఆడటం నాకు చాలా ఇష్టం. అయితే ఇక నన్ను ఐదవ స్థానంలో పంపడం విషయంలో కెప్టెన్ రోహిత్ శర్మ పూర్తి క్లారిటీతో ఉన్నాడు. రానున్న రోజుల్లో కూడా ఐదవ స్థానంలోనే బ్యాటింగ్ చేయాల్సి వస్తుందని ముందే క్లారిటీ ఇచ్చాడు. ఇక ఆ స్థానంలో బ్యాటింగ్  చేయడానికి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతున్న అంటూ రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: