గుడ్ న్యూస్ : ఐపీఎల్ 2023 ని ఫ్రీగా చూసే ఛాన్స్?

praveen
2023 ఐపీఎల్ సీజన్ కోసం అటు అభిమానులు అందరూ కూడా వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు అన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న జరిగిన ఐపీఎల్ వేలంలో భాగంగా ఎంతో మంది స్టార్ ప్లేయర్లు ఒక జట్టు నుంచి మరో జట్టులోకి వెళ్లిపోయారు. అదే సమయంలో కొన్ని జట్లకి కొత్త కెప్టెన్లు కూడా వచ్చారు. దీంతో ఇక ఈసారి ఐపీఎల్ పోరు మరింత రసవత్తరంగా మారబోతుంది అని క్రికెట్ ప్రేక్షకులు అందరూ కూడా నమ్మకం పెట్టుకున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఐపీఎల్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్న ఐపీఎల్ వార్త ఏది తెరమీదకి వచ్చిన హాట్ టాపిక్ గా మారిపోతుంది.

 ఈ క్రమంలోనే ఇక ఐపీఎల్ ఎంటర్టైన్మెంట్ కావాలి అంటే మాత్రం ఇక మరో రెండు నెలల వరకు ప్రేక్షకులు వేచి చూడాల్సిందే అన్న విషయం తెలిసింది. అయితే ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లును చేస్తుంది భారత క్రికెట్ నియంత్రణ మండలి. అయితే ఈ ఏడాది ఐపీఎల్ డిజిటల్ రైట్స్ ని జియో సినిమా దక్కించుకుంది అన్న విషయం తెలిసిందే.  ఇక ఇప్పుడు ఎంతోమంది ప్రేక్షకులకు జియో సినిమా ఒక బంపర్ ఆఫర్ ను ప్రకటించింది. మొన్నటి వరకు ఐపీఎల్ ని ప్రత్యక్ష ప్రసారం చూడాలి అంటే ఏదైనా ఒక ఓటిటి యాప్ ను వందల రూపాయలు పెట్టి సబ్ స్క్రిప్షన్  చేసుకోవలసి ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఎలాంటి సబ్ స్క్రిప్షన్ లేకుండానే ఫ్రీగా ఐపీఎల్ ను చూసేందుకు అవకాశం ఉంది అని చెప్పాలి.

 ఇక ఇలాంటి బంపర్ ఆఫర్ ను జియో సినిమా అందించింది అని చెప్పాలి. అయితే ఇక ఇలాంటి ఆఫర్ కారణంగా ఇక ప్రేక్షకులు అందరి దృష్టిని తమ తమ వైపు ఆకర్షించి సబ్ స్క్రిప్షన్ల  సంఖ్యను ఒక్కసారిగా పెంచుకోవాలని ప్లాన్ వేసింది జియో సినిమా. అయితే ఈ విషయం తెలిసిన అభిమానులు అందరూ కూడా ఆనందంలో మునిగిపోతున్నారు అని చెప్పాలి. ఎలాంటి వ్యూహంతో జియో ఈ ఆఫర్ ప్రకటించిందో కానీ ఈ ఆఫర్ మాత్రం మాకు బాగా నచ్చేసింది అంటూ ఎంతోమంది క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారని చెప్పాలి. కాగా గత ఏడాది ఐపీఎల్ సీజన్లో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన గుజరాత్ టైటాన్స్ టైటిల్ గెలిచింది. మరి ఈ ఏడాది ఎవరు గెలుస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: