వైరల్ : సిరాజ్ బంతికి.. తెల్లమోహం వేసిన శ్రీలంక బ్యాట్స్మెన్?

praveen
గత కొంతకాలం  నుంచి భారత బౌలింగ్ విభాగంలో కీలక ప్లేయర్గా మారిపోయాడు హైదరాబాద్ ఫేసర్ సిరాజ్. ఇక టీమ్ ఇండియా తరపున దక్కిన ప్రతి అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకుంటూ అదరగొడుతున్నాడు అని చెప్పాలి. ఒకవైపు తన అద్భుతమైన బౌలింగ్తో బ్యాట్స్మెన్లను ఇబ్బంది పెడుతూ పరుగులను కట్టడం చేస్తున్నాడు. మరోవైపు కీలక సమయంలో వికెట్లు పడగొట్టి ఇక టీమిండియా విజయంలో కీలక పాత్ర వహిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇటీవల గౌహతి వేదికగా శ్రీలంకతో జరిగిన మొదటి వన్డే మ్యాచ్లో కూడా మహమ్మద్ సిరాజ్ అదరగొట్టాడు అనే విషయం తెలిసింది.

 కీలకమైన రెండు వికెట్లు పడగొట్టి ఇక టీమిండియా విజయంలో కీలక పాత్ర వహించాడు. ముఖ్యంగా శ్రీలంక జట్టులో స్టార్ బాట్స్మన్ గా కొనసాగుతున్న కుషాల్ మొండిస్ ను అద్భుతమైన ఇన్ స్వింగర్ తో ఇక మహమ్మద్ సిరాజ్ అవుట్ చేసిన తీరు మాత్రం మ్యాచ్ మొత్తానికే హైలైట్ గా మారిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే సిరాజ్ వేసిన బంతిని అంచనా వేయలేకపోయిన కుషాల్ మొండిస్ చివరికి వికెట్లను కోల్పోయాడు  దీంతో తాను వికెట్ అయినా విధానాన్ని చూసి ఒక్కసారిగా కుషాల్ మొండిస్ షాక్ లో మునిగిపోయాడు అని చెప్పాలి.

 మహమ్మద్ సిరాజ్ వేసిన బంతిని కుషాల్ మొండిస్ కవర్స్ వైపు ఆడేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా బంతి ఇన్ స్వింగ్ అయి లోపలికి టర్న్ తీసుకుంది. దీంతో ఇక కుషాల్ మొండిస్ ఏమి చేయలేకపోయాడు. బంతి వేగంగా దూసుకుపోయి వికెట్లను గిరాటేసింది అని చెప్పాలి. దీంతో ఇలా ఎలా జరిగింది అని ఇక ఇన్ స్వింగర్ బంతికి ఒక్కసారిగా తెల్ల మొహం వేశాడు కుషాల్ మొండిస్. ఇన్దుకు సంబంధించిన వీడియో ట్విట్టర్ వేదిక వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి.ఈ మ్యాచ్లో టీమిండియా భారీ పరుగులు తేడాతో విజయం సాధించింది అన్న విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: