రోహిత్ నిర్ణయం అస్సలు నచ్చలేదు : వెంకటేశ్ ప్రసాద్

praveen
ఇటీవల కాలంలో టీమిండియాలో ఏ ఆటగాడికి చోటు దక్కుతుందో ఏ ఆటగాడిపై వేటు పడుతుందో అన్నది ఊహకందని విధంగానే మారిపోయింది అని చెప్పాలి. సాధారణంగా అయితే ఒకప్పుడు మంచి ప్రదర్శన చేసిన ఆటగాడికి ఇక టీమిండియా వరుసగా అవకాశాలు ఇస్తూ ఉండేది. ఇక వాళ్లు ఎప్పుడైనా పేలవా ప్రదర్శన చేసినప్పుడు మాత్రమే వారిపై వేటు వేసేవారు. కానీ ఇటీవల కాలంలో మంచి ప్రదర్శన చేసిన టీమిండియాలో వారికి స్థానం దక్కుతుంది అన్న గ్యారెంటీ లేకుండా పోయింది అని చెప్పాలి.

 టీమిండియా యాజమాన్యం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఇందుకు నిదర్శనంగా మారిపోయింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం శ్రీలంకతో వన్డే సిరీస్ ఆడుతుంది టీమిండియా. ఇక సీనియర్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ కూడా జట్టులో భాగం అయ్యారు అని చెప్పాలి. ఇకపోతే వన్డే జట్టులో ఇషాన్ కిషన్ తప్పకుండా చోటు సంపాదించుకుంటాడని అందరు భావించారు. ఎందుకంటే బంగ్లాదేశ్ తో జరిగిన వన్డే సిరీస్లో వచ్చిన ఒక్క అవకాశం లోనే డబుల్ సెంచరీ చేసి అదరగొట్టాడు.
 కానీ ఊహించని రీతిలో అతనికి బదులు పేలవ ప్రదర్శన చేస్తున్న గిల్ కు ఛాన్స్ ఇస్తున్నట్లు రోహిత్ శర్మ ప్రకటించాడు. ఇక ఇదే విషయంపై అభిమానులు అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ ఆటగాడు వెంకటేష్ ప్రసాద్ సైతం ఇషన్ కిషన్ పై వేటు వేయడం పై స్పందిస్తూ విమర్శలు గుప్పించాడు. ద్విశతకం బాదిన ఆటగాడికి వన్డేల్లో చోటు లేకపోవడం ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఇదంతా గిల్ కోసమే చేస్తున్నట్లుగా ఉంది. కానీ డబుల్ సెంచరీ సాధించిన వాడిని పక్కన పెట్టడం మాత్రం అస్సలు సరైంది కాదు. ఒకవేళ గిల్ ను తీసుకోవాలనుకుంటే మూడో స్థానంలో  పంపవచ్చు. కేఎల్ రాహుల్కు బదులు ఇషాన్ కిషన్ తీసుకొని ఓపెనర్ ఆడిస్తే బాగుంటుంది.  గతంలో ఇంగ్లాండ్ మీద రిషబ్ పంత్ కూడా సెంచరీ తో భారత్ను గెలిపించాడు. కానీ తర్వాత టి20 ఫామ్ కారణంగా చూపి వన్డేల్లోకి అతని తీసుకోలేదు. పేలవ ప్రదర్శన చేస్తున్న కేఎల్ రాహుల్ మాత్రం టీమిండియాలో చోటు దక్కించుకుంటున్నాడు అంటూ వెంకటేష్ ప్రసాద్ విమర్శల గుప్పించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: