ఉమెన్స్ ఐపీఎల్.. వేలంలో పేర్ల నమోదుకు డెడ్ లైన్?

praveen
మొన్నడి వరకు కేవలం పురుషులకు మాత్రమే పరిమితమైన ఇండియన్ ప్రీమియర్ లీగ్ అటు ప్రేక్షకులకు ఎంతలా ఎంటర్టైన్మెంట్ పంచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఇక ఇప్పుడు మహిళా క్రికెటర్లు కూడా ఐపీఎల్ లో సందడి చేసేందుకు సిద్ధమవుతున్నారు అన్న విషయం తెలిసిందే. మహిళ ఐపిఎల్ నిర్వహించేందుకు గత ఏడాది నుంచి అన్ని రకాల ప్రణాళికలను సిద్ధం చేస్తుంది బీసీసీఐ. ఇక ఈ ఏడాది మొదటి మహిళా ఐపీఎల్ సీజన్ ప్రారంభం కాబోతోంది అన్న విషయం తెలిసిందే.

 దీనికోసం ఇక అన్ని సన్నాహాలు చేసేస్తుంది. ఇందులో భాగంగానే ఇక ఐపీఎల్ మెగా వేలం నిర్వహించబోతుంది అని చెప్పాలి. కాగా ఇందుకోసం క్రికెటర్ల పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. కాగా ప్రస్తుతం భారత క్రికెటర్లతో పాటు విదేశీ క్రికెటర్లు కూడా మహిళా ఐపీఎల్ కోసం భారీగా తమ పేర్లను నమోదు చేసుకోవడానికి ముందుకు వస్తున్నారు. కాగా ఇక ఇలా పేర్ల నమోదు ప్రక్రియకు అటు ఐపీఎల్ డెడ్ లైన్ విధించింది అని చెప్పాలి.. జనవరి 26వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు మాత్రమే ఇక ఐపీఎల్ వేలం కోసం ప్లేయర్లు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అవకాశం ఉంది అంటూ తెలిపింది.

 ఇక అదే సమయంలో ఫిబ్రవరిలో ఉమెన్స్ ఐపీఎల్ మెగా వేలం ప్రక్రియ జరుగుతుంది అన్న విషయాన్ని కూడా స్పష్టం చేసింది. అయితే జాతీయ జట్టుకు ఆడుతున్న ప్లేయర్ల కోసం మూడు కేటగిరీల రివర్స్ ప్రైస్ ను బీసీసీఐ ప్రకటించింది అని చెప్పాలి. వీళ్ళ కనీస ధరను 50 లక్షలు 40 లక్షలు 30 లక్షలు గా ఉండనున్నట్లు తెలిపింది. ఆన్ క్యాప్ ప్లేయర్స్ కు 20 లక్షలు 10 లక్షలు కనీస ధర ఉండనున్నట్లు తెలిపింది. అయితే వేలంలో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఐదు లక్షలు చెల్లించాలని ఆ మొత్తాన్ని తిరిగి చెల్లించబోము అంటూ ఇప్పటికే బీసీసీఐ మహిళా క్రికెటర్లకు తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ipl

సంబంధిత వార్తలు: