ప్చ్.. బాబర్ కు ఘోర అవమానం?

praveen
నేటి జనరేషన్ క్రికెటర్లలో అత్యుత్తమ ఆటగాళ్లుగా పరిగణించబడుతున్న వారిలో పాకిస్తాన్ కెప్టెన్గా కొనసాగుతున్న బాబర్ ఆజాం కూడా ఒకడు అనే విషయం తెలిసిందదే. ఇటీవల కాలంలో తన ప్రదర్శనతో ఇక ఎన్నో రికార్డులు కొల్లగొడుతూ దూసుకుపోతున్నాడని చెప్పాలి. ఇక మూడు ఫార్మాట్లలో కూడా మంచి ప్రదర్శన చేస్తున్నాడు. పాకిస్తాన్ జట్టులో ఓపెనర్ గా బరిలోకి దిగుతూ మంచి ఆరంభాలు అందిస్తూ ఉన్నాడు అని చెప్పాలి. అయితే ఇటీవల కాలంలో మాత్రం ఏకంగా పాకిస్తాన్ జట్టు వరుసగా పరాజయల పాలవుతున్న నేపథ్యంలో బాబర్ పై విమర్శలు వస్తున్నాయి.

 ఇదిలా ఉంటే ప్రస్తుతం పాకిస్తాన్ కెప్టెన్ గా కొనసాగుతున్న బాబర్ అజాం కి ఘోర అవమానం జరిగింది. ఇక ఇందుకు సంబంధించిన విషయం కాస్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. క్రికెట్ ఐస్ ల్యాండ్ ఇటీవల ప్రకటించిన పాకిస్తాన్ ఆల్ టైం వన్డే జట్టులో బాబర్ అజం పేరు కనిపించింది. బాబర్ అజం పేరు కనిపించింది కదా మళ్లీ ఘోర అవమానం ఏంటి అని అనుకుంటున్నారు కదా.. అయితే బాబర్ అజం పేరును ఆల్ టైం వన్డే జట్టులో కాకుండా చివరిలో చివర్లో డ్రింక్స్ బాయ్స్ జాబితాలో చేర్చడం గమనార్హం. బాబర్ తో పాటు మహమ్మద్ హఫీస్, షోయబ్ మాలిక్ పేర్లను కూడా క్రికెట్ ఐస్లాండ్ డ్రింక్స్ బాయ్స్ జాబితాలో చేర్చింది.

 ఇందుకు సంబంధించిన ట్వీట్ కాస్తా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. దీంతో ఇది చూసిన ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు. ప్రస్తుతం అంతర్జాతీయ క్రికెట్లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా కొనసాగుతూ పాకిస్తాన్ జట్టుకు కెప్టెన్ గా కూడా ఉన్న బాబర్ అజాం పేరును డ్రింక్స్ బాయ్స్ లిస్టులో చూపించడమేంటి అంటూ ఎంతో మంది ఫాన్స్ ఇక క్రికెట్ ఐస్ ల్యాండ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అని చెప్పాలి. ఈ విషయంపై వెంటనే క్రికెట్ ఐస్లాండ్ బాబర్కు క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: