బాబర్ ఇక నాటకాలు ఆపు.. నేటిజన్ పోస్ట్.. లైక్ కొట్టిన సర్పరాజ్?

praveen
సాధారణంగా పాకిస్తాన్ జట్టులో 30 ఏళ్ల వయస్సు పైబడిన ఆటగాళ్లను తీసుకోవడం చాలా తక్కువగా చూస్తూ ఉంటాము. ఇక 30 ఏళ్ల వయసు నిండిందంటే చాలు జట్టులో చోటు కోసం స్టార్ ప్లేయర్లు సైతం నిరీక్షణగా ఎదురు చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. అలాంటిదిఅప్పటికే జట్టుకు దూరమైన నాలుగేళ్లు గడిచిపోయింది. ఇక 35 ఏళ్ల వయసులో ఊహించని రీతిలో పాకిస్తాన్ మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ పాకిస్తాన్ జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చాడు అని చెప్పాలి.

 న్యూజిలాండ్తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ ద్వారా మళ్ళీ జట్టులోకి పునరాగమనం చేసిన సర్పరాజ్ అహ్మద్ తన అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. ఏకంగా రెండు మ్యాచ్లలో ఒక సెంచరీ కూడా నమోదు చేశాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే అతనిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మొదటి టెస్ట్ రెండు ఇన్నింగ్స్ లో 86, 53 పరుగులు.. ఇక రెండవ టెస్టులో 78, 118 పరుగులు చేసి ఆకట్టుకున్నాడు. మొత్తంగా న్యూజిలాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్లో 335 పరుగులు చేశాడు అని చెప్పాలి.

 అయితే సర్పరాజ్ అహ్మద్ సెంచరీ చేసిన సమయంలో కెప్టెన్ బాబర్ ఓపినర్ ఇమాముల్ హక్, ఇతర సభ్యులందరూ కూడా స్టాండింగ్ ఓవషన్ ఇచ్చి అభినందించారు.  కెరియర్ ముగిసిపోయింది అనుకున్న సమయంలో మళ్లీ జట్టులోకి వచ్చి సెంచరీ చేయడంతో సర్పరాజ్  ఆనందానికి అవధులు లేకుండా పోయాయ్ అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఫాన్స్ కూడా భిన్నంగా కామెంట్ చేస్తున్నారు. జట్టుకు సారధిగా ఎంతగానో సేవలందించిన ఆటగాడిని.. మీ చెత్త రాజకీయాలకు బలి చేశారు. ఒక కెప్టెన్ ను వాటర్ మ్యాన్ లాగా మార్చి ఘోరంగా అవమానించారు. ఇక ఇప్పుడు అతను యాక్షన్ లోకి దిగి అదరగొట్టేసరికి కీర్తిస్తున్నారు. నాటకాలు ఆపండి.. ఇక చాలు.. అంటూ స్టాండింగ్ ఓవేషన్ ఫొటోస్ షేర్ చేసి బాబర్ను ఉద్దేశించి ఒక నెటిజన్ పోస్ట్ పెట్టాడు. ఇది వైరల్ గా మారిపోయింది. అయితే ఈ పోస్టును అటుకు సర్పరాజ్ కూడా లైక్ చేయడం మరింత సంచలనంగా మారిపోయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: