నేను ఆల్రౌండర్ ని.. చాహల్ నీకు ఎప్పుడు ఆ ఛాన్స్ రాదు?
ఈ క్రమంలోనే టీమిండియా లెగ్ స్పిన్నర్ చాహాల్.. సౌత్ ఆఫ్రికా చైనా మన్ బౌలర్ అయిన తబ్రెజ్ షంషీ ఒకరిని ఒకరు ఆటపట్టించుకోవడంలో ఎప్పుడు ముందుంటారూ అని చెప్పాలి. ఐపిఎల్ లో రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ తరఫున ఆడుతున్నారు ఈ ఇద్దరు క్రికెటర్లు. దీంతో వీరిద్దరి మధ్య స్నేహబంధం ఎంతగానో బలపడింది అని చెప్పాలి. దీంతో ఒకరిపై ఒకరు ఫన్నీ సెటైర్లు వేసుకుంటూ సరదాగా మాటలు యుద్ధానికి దిగుతూ ఉంటారు. ఈ క్రమంలోనే జనవరి 10వ తేదీ నుంచి సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ ప్రారంభం కానుండగా ఇటీవల తబ్రేజ్ షంషి చాహాల్ ను ఉద్దేశిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
రాజస్థాన్ ఫ్రాంచైజీ జట్టు పర్ల్స్ రాయల్స్ తరపున సౌత్ ఆఫ్రికా టీ20 లీగ్ లో భాగంగా ప్రాతినిధ్యం వహిస్తున్నాడు తబ్రేజ్ షంశి. అయితే ఇటీవల చాహల్ ను ఉద్దేశిస్తూ.. హలో చాహల్ సౌత్ ఆఫ్రికా నుంచి నేను ఆల్రౌండర్ ని మాట్లాడుతున్న.. నువ్వు ఎంత ప్రయత్నించినా బ్యాటింగ్ ఆర్డర్ లో నాకంటే ముందు స్థానంలో ఎప్పుడు రాలేవు.. ఎప్పుడు అంటే ఎప్పుడు కూడా నీకు అవకాశం రాదు అంటూ యూజువెంద్ర చాహాల్ పై సెటైరికల్ గా కామెంట్స్ చేశాడు తబ్రేజ్ షంషి. అయితే ఇదే విషయంపై స్పందించిన చాహల్.. అది సరే కానీ నీ పొట్ట సంగతి ఏంటి.. కాస్త చెప్పు బ్రో అంటూ ఇక అటు భారత స్పిన్నర్ చాహాల్ సైతం గట్టి కౌంటర్ ఇచ్చాడు అని చెప్పాలి.