చీఫ్ సెలెక్టర్గా చెబుతున్నా.. వరల్డ్ కప్ లో ఆ ఇద్దరు వద్దు?

praveen
2023 ఏడాదిలో అటు భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరగబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే దాదాపు 15 ఏళ్ల నుంచి ఐసీసీ ట్రోఫీని ముద్దాడ లేకపోయినా టీమ్ ఇండియా జట్టు ఇక ఈసారి భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ ను మాత్రం తప్పక గెలిచి తీరాలని భావిస్తుంది. ఇందుకోసం అటు బీసీసీఐ కూడా ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతుంది అన్న విషయం తెలిసిందే. అయితే వన్డే వరల్డ్ కప్ కోసం సెలెక్ట్ చేయబోయే ఆటగాళ్లను 20 మందిని షార్ట్ లిస్టు చేసినట్లు ఇప్పటికే ప్రచారం జరుగుతుంది.

 ఇకపోతే ఇక ఇటీవల జట్టులో ఎవరు ఉంటే బాగుంటుంది అనే విషయంపై ఎంతో మంది మాజీ ఆటగాళ్లు ఇక తమ రివ్యూ లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఇదే విషయంపై స్పందించిన టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ సైతం ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇక తాను ఒకవేళ భారత జట్టుకు చీప్ సెలెక్టర్ గా ఉంటే మాత్రం తన వరల్డ్ కప్ జట్టులో శుభమన్ గిల్, శార్దుల్ ఠాకూర్లకు చోటు ఉండదు అంటూ చెప్పుకొచ్చాడు. బుమ్రా, ఉమ్రాన్ మాలిక్, అర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్ లు జట్టులో ఉంటే సరిపోతుంది. షమి  సో సో గా బౌలింగ్ చేస్తాడు అంటూ కృష్ణమాచారి శ్రీకాంత్ వాక్యానించాడు.

 కాబట్టి వరల్డ్ కప్ జట్టులో అతను లేకపోయినా పెద్దగా తేడా ఏమీ ఉండదు. ఇక ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆదరగొడుతున్న దీపక్ కూడా జట్టులో ఉంటే బాగుంటుంది అంటూ కృష్ణమాచారి శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. ఒంటి చేత్తో మ్యాచ్ను గెలిపించగల సత్తా ఉన్న యూసఫ్ పఠాన్ లాంటి రేసుగుర్రాలు భారత జట్టులో ఉంటే బాగుంటుందని అందరూ కోరుకుంటారు. ఇక నా వరకైతే అలాంటి గెలుపు గుర్రం రిషబ్ పంత్ అంటూ చెప్పుకొచ్చాడు కృష్ణమాచారి శ్రీకాంత్. ఈ క్షణంలోనైనా మ్యాచ్ ను మలుపు తిప్పగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాడు అంటూ చెప్పుకొచ్చాడు. అభిమానిగా కాకుండా చీఫ్ సెలెక్టర్ పదవిలో ఉన్నానని  బావించి.. ఈ మాటలు మాట్లాడాను అంటూ ఇక కృష్ణమాచారి శ్రీకాంత్ వాక్యానించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: