హార్దిక్ కెప్టెన్సీ పై.. అశ్విన్ ఏమన్నాడో తెలుసా.

praveen
టీమిండియా ఫ్యూచర్ కెప్టెన్ ఎవరు అంటే ప్రస్తుత పరిస్థితి చూస్తే మాత్రం గూగుల్లో కొట్టిన హార్దిక్ పాండ్యా పేరు వస్తుందేమో అన్న విధంగా మారిపోయింది పరిస్థితి. ఎందుకంటే గత ఏడాది జరిగిన టి20 వరల్డ్ కప్ లో టీమిండియా వైఫల్యం తర్వాత ఇక టీమ్ ఇండియాకు కొత్త కెప్టెన్ అవసరమని మరీ ముఖ్యంగా యువ ఆటగాళ్లతో కూడిన టి20 జట్టు భారత క్రికెట్ లో ఎంతో ముఖ్యం అంటూ మాజీ ఆటగాళ్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే ఐపిఎల్ లో మొదటి ప్రయత్నంలోనే గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ గా టైటిల్ అందుకున్న హార్దిక్ పాండ్యాకు ఇక భారత టి20 జట్టు కెప్టెన్సీ అప్పగిస్తే బాగుంటుందని ఎంతోమంది సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలను వ్యక్తపరిచారు.

 ఆ తర్వాత కాలంలో రోహిత్ అందుబాటులో లేని సమయంలో హార్దిక్ కు కెప్టెన్సీ అప్పగిస్తూ బీసీసీఐ నిర్ణయం తీసుకోవడం కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది. ఇప్పుడు ఏకంగా త్వరలో హార్దిక్ పాండ్యా కెప్టెన్ కాబోతున్నాడు అని ప్రచారం జరుగుతున్న సమయంలో శ్రీలంకతో జరిగే టి20 సిరీస్ కోసం హార్దిక్ పాండ్యాకు  సారధ్య బాధ్యతలు  అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. అయితే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో బరిలోకి దిగిన టీమిండియా మొదటి మ్యాచ్ లో విజయం సాధించి రెండో మ్యాచ్లో ఓడిపోయింది. ఇక నేడు మూడో టి20 మ్యాచ్ ఆడబోతుంది.

 ఇదిలా ఉంటే ఇటీవల హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ పై టీమ్ ఇండియాలో సీనియర్ స్పిన్నర్ గా కొనసాగుతున్న రవిచంద్రన్ అశ్విన్ స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. హార్దిక్ పాండ్యా మైదానంలో ఎంతో కూల్ గా ఉంటాడు. అతను కూల్ గా ఉండడమే కాదు జట్టులోని ఆటగాళ్లు అందరిని కూడా రిలాక్స్ గా ఉంచుతాడని అశ్విన్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక ఒక కెప్టెన్ మైదానంలో ఇలా ప్లేయర్స్ తో ఉంటే.. ఆటగాళ్లు అందరూ కలిసికట్టుగా బాగా రాణిస్తారని చెప్పుకొచ్చాడు రవిచంద్రన్ అశ్విన్. అయితే ఇప్పుడు వరకు కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా సక్సెస్ అయినట్లు భావిస్తున్నానని మరోవైపు మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ కూడా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: