మొదటి టి20 మ్యాచ్.. స్టార్ స్పోర్ట్స్ కి 200 కోట్లు నష్టం?

praveen
స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న టి20 సిరీస్ లో భాగంగా భారత జట్టు కొత్త ఏడాదిని ఉత్కంఠ బరితమైన విజయంతో ప్రారంభించింది అన్న విషయం తెలిసిందే. మొదటి టి20 మ్యాచ్లో నువ్వు నేను అన్నట్లుగా సాగిన పోరులో చివరికి రెండు పరుగుల తేడాతో టీమ్ ఇండియా జట్టు విజయం సాధించింది అని చెప్పాలి. సీనియర్లు రోహిత్ శర్మ, కే ఎల్ రాహుల్, విరాట్ కోహ్లీలు ప్రస్తుతం జట్టుకు దూరంగా ఉన్న నేపథ్యంలో యువ ఆటగాడు హార్దిక్ పాండ్యాకు సారధ్య బాధ్యతలు అప్పగించింది టీమ్ ఇండియా యాజమాన్యం.

 అంతేకాదు ఇక టి20 సిరీస్ ఆడుతున్న జట్టులో ఎవరికి సీనియర్లకు చోటు ఇవ్వకుండా యువ ఆటగాళ్లకే పెద్ద పీట వేసింది అని చెప్పాలి. అయితే ఇటీవల భారత జట్టు విజయం సాధించినప్పటికీ అటు భారత అభిమానులు మాత్రం ఏకంగా విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేని మ్యాచులను చూసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఏకంగా ఇండియా విజయం సాధించిన మొదటి టీ20 మ్యాచ్ కారణంగా అటు అధికారిక బ్రాడ్కాస్టర్ అయినా స్టార్ స్పోర్ట్స్ కి దాదాపు 200 కోట్ల నష్టం వాటిల్లిందట.

 అయితే విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మా లాంటి స్టార్ క్రికెటర్లు లేకపోవడంతో ఇక అటు ఎంతో మంది అభిమానులు కూడా ఈ మ్యాచ్ కు లైట్ తీసుకున్నారట. అంతేకాదు ఇక మ్యాచ్ మధ్యలో అడ్వర్టైజింగ్ చేసేందుకు కంపెనీలు అన్నీ కూడా దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. కేవలం ఈ సిరీస్ మొత్తానికి రెండు మూడు బ్రాండ్స్ మాత్రమే ఇక అడ్వర్టైజ్డ్ ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయట. భారీ ధరకు బ్రాడ్ కాస్ట్ హక్కులను దక్కించుకున్న స్టార్ నెట్వర్క్ ఒక్కొక్క మ్యాచ్ కి 60 కోట్లను బీసీసీఐకి చెల్లిస్తుంది. కానీ మొదటి టి20 మ్యాచ్ పట్ల బడా కంపెనీలు ఏవి ఆసక్తి కనబరచక పోవడంతో చివరికి డిస్నీ ప్లస్ హాట్ స్టార్, స్టార్ స్పోర్ట్స్  లో మొత్తం కలిపి 200 కోట్లకు పైగా నష్టం వాటిల్లిందట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: