రోనాల్డో అంటే.. ఆ మాత్రం ఉంటుంది మరి?

praveen
ప్రస్తుతం ప్రపంచంలో ఉన్న అన్ని రకాల క్రీడల్లో ఇక ప్రపంచవ్యాప్తంగా మారుమూలన ఉన్న దేశాల్లో సైతం ఎక్కువ గుర్తింపు సంపాదించుకున్న ఆట ఏదైనా ఉంది అంటే అది ఫుట్బాల్ అనే చెప్పాలి. ఏకంగా ఫుట్ బాల్ మ్యాచ్ వస్తుందంటే చాలు ఇక క్రీడ అభిమానులు అందరూ కూడా టీవీలకు అతుక్కుపోతూ  ఉంటారు. కుదిరితే స్టేడియం కి వెళ్లి ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించడానికి ఆసక్తి కనబరుస్తూ ఉంటారు అని చెప్పాలి. ఇక ఫుట్బాల్ ఆటకు ఎంత క్రేజ్ ఉందో ఇక ఆటలో స్టార్ ప్లేయర్లుగా ఎదిగిన వారికి కూడా అదే రేంజిలో క్రేజ్ ఉంది.

 ఇక ఇలా ఫుట్బాల్ ఆటలో ఎన్నో ఏళ్ల నుంచి స్టార్ ప్లేయర్గా హవా నడిపిస్తూ ప్రపంచ వ్యాప్తంగా  కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న ఆటగాళ్లలో క్రిస్టియానో రోనాల్డో మొదటి స్థానంలో ఉంటాడు అన్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా పోర్చుగల్ జట్టు తరఫున ప్రాతినిధ్యం వహించిన క్రిస్టియానో రోనాల్డో కప్పు గెలవడం కోసం ఎంతగానో పోరాడినప్పటికీ చివరికి నిరాశ మిగిలింది.  అయితే ఇక ఇటీవల క్రిస్టియానో రోనాల్డో మరోసారి వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయారు అని చెప్పాలి. ఎందుకంటే ఇటీవల సౌదీ అరేబియా  క్లబ్ జట్టు అయిన అల్ నజర్ కు ఆడేందుకు సిద్ధమయ్యాడు క్రిస్టియానో రోనాల్డో. ఇందుకు సంబంధించి వందల కోట్ల రూపాయల ఒప్పందం కుదుర్చుకున్నాడు.

 అయితే ఇక ప్రస్తుతం ఫుట్బాల్ ఆటలో స్టార్ ప్రేయర్ గా కొనసాగుతున్న క్రిస్టియానో రోనాల్డో సౌదీ అరేబియా ఫుట్బాల్ జట్టు తరఫున ఆడటానికి సిద్ధమయ్యాడో లేదో అంతలోనే జట్టు క్రేజ్ ఒక రేంజ్ లో పెరిగిపోయింది. రోనాల్డో రాకకు ముందు వరకు ఇన్స్టాగ్రామ్ లో ఫాలోవర్ల సంఖ్య 8.6 లక్షలు మాత్రమే. కానీ క్రిస్టియానో రోనాల్డో వచ్చిన తర్వాత మాత్రం 48 గంటల్లోనే 30 లక్షలకు ఇక ఆ తర్వాత మరునాడే ఏకంగా 73 లక్షలకు మారిపోయింది. ఇక ఈ విషయం తెలిసి క్రిస్టియానో రోనాల్డో క్రేజ్ అంటే ఆ మాత్రం ఉంటుందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా 215 డాలర్లతో క్రిస్టియానో రోనాల్డో డీల్ కుదుర్చుకోవడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: