శ్రీలంకలో ఆ 5 ప్లేయర్స్ ను అడ్డుకుంటే విజయం మనదే ?

VAMSI
ఇంకాసేపట్లో ఇండియా మరియు శ్రీలంకల మధ్యన ముంబైలోనే వాంఖేడ్ స్టేడియం లో మొదటి టీ 20 మ్యాచ్ స్టార్ట్ కానుంది. బంగ్లాదేశ్ తో వన్ డే లలో సిరీస్ ను కోల్పోయినా , వెంటనే తేరుకుని టెస్ట్ లలో క్లీన్ స్వీప్ చేసి సగర్వంగా స్వదేశానికి వచ్చింది. ఇప్పుడు వచ్చి రాగానే ఇండియా శ్రీలంక తో మూడు టీ 20 లు మరియు మూడు వన్ డే ల సిరీస్ ను ఆడనుంది. మొదటగా టీ 20 సిరీస్ మొదలు కానుండగా , సీనియర్లు అయిన రోహిత్ శర్మ , విరాట్ కోహ్లీ, రాహుల్ మరియు పంత్ లకు బీసీసీఐ విశ్రాంతినిచ్చింది. దానితో టీం లో అంత కుర్రవాళ్ళతో హార్దిక్ పాండ్య బరిలోకి దిగనున్నాడు. ముంబై లోని పిచ్ లు అన్నీ బ్యాటింగ్ కు స్వర్గధామంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. పైగా బౌండరీలు కూడా దగ్గరగా ఉండి బ్యాట్సమన్ లకు ఫేవర్ అని చెప్పాలి.
ఇక్కడ ఉన్న రికార్డును బట్టి చూస్తే చేజింగ్ చేసే టీం కు గెలుపు అవకాశాలు ఎక్కుగా ఉంటాయని తెలుస్తోంది. సిరీస్ కు ముందు మాజీ క్రికెటర్లు శ్రీలంకకు లైట్ గా తీసుకోకండి... మొన్న జరిగిన ఆసియా కప్ ను గుర్తు తెచ్చుకోండి ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి టైటిల్ ను అందుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది అంటూ హెచ్చరించారు. ఇక శ్రీలంక టీం లో ఉన్న ఆ అయిదుమంది ఆటగాళ్లను కనుక అడ్డుకుంటే ఇండియా విజయాన్ని ఆపడం సాధ్యం కాదు. వారిలో ముందుగా శ్రీలంక కెప్టెన్ దసున్ శనక గురించి చెప్పుకోవాలి.. మంచి ఆల్ రౌండర్ గా ఎంతో కాలం నుండి జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. ఎటువంటి బంతిని అయినా సునాయాసంగా స్టాండ్స్ లోకి పంపగల దిట్ట శనక. ఇక బౌలింగ్ లోనూ టైట్ ఓవర్లు వేసి ప్రత్యర్థిపై ఒత్తిడి తీసుకురాగలడు.
ఇక ఓపెనర్ పతుమ్ నిస్సంక చాలా కాలంగా మంచి ఫామ్ లో కొనసాగుతున్నాడు. ఇతనిని త్వరగా అవుట్ చేయకపోతే కష్టమే. భానుక రాజపక్స ఈతరం టీ 20 డేంజరస్ బ్యాట్స్మన్ లలో ఒకరు. ఏ క్షణం ఎలా ఆడుతునాడు అన్నది ఎవ్వరూ ఊహించలేము. బౌలింగ్ లో హాసరంగా మరియు తీక్షణల ను ఆచితూచి ఆడకపోతే వికెట్ సమర్పించుకోవడం పక్కా. సో .. ఈ అయిదుగురు ఆటగాళ్ల విషయంలో జాగ్రత్తగా ఉండకపోతే ఓటమై ఖాయం.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: