ధోనికి వచ్చిన స్పందన చూసి.. ఒక్కసారిగా షాకయ్యా?

praveen
టీమిండియా మాజీ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనీకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ధోని ఎక్కడ కనిపించినా కూడా అభిమానులు అక్కడికి భారీగా తరలి వెళ్తూ ఉంటారు అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్కు రిటర్మెంట్ ప్రకటించడంతో కేవలం ఐపిఎల్ లో మాత్రమే తన ఆట తీరుతో అభిమానులను అలరిస్తున్నాడు. దీంతో కేవలం ఐపిఎల్ లో మ్యాచ్లు జరిగినప్పుడు మాత్రమే కాదు ధోని ప్రాక్టీస్ మ్యాచ్ ఆడుతున్నాడని తెలిసిన కూడా అభిమానులు స్టేడియంకి భారీగా తరలి రావడం చేస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇక 2023 ఐపీఎల్ సీజన్ కోసం ధోని మైదానంలోకి దిగి ప్రాక్టీస్ మొదలు పెట్టాడు.

 ఈ క్రమంలోనే ఇక ధోనిని చూసేందుకు అభిమానులు ఏకంగా మ్యాచ్ జరుగుతున్నప్పుడు వచ్చినట్లుగానే భారీగా తరలి రావడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ క్రమంలోనే చెన్నై సూపర్ కింగ్స్ కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. చెన్నైలోనే చపాక్ స్టేడియం 20,000 మంది అభిమానులతో నిండిపోయింది. ధోని ప్రాక్టీస్ కోసం స్టేడియంలోకి అడుగుపెట్టగానే ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా ధోని పేరుతో హోరెత్తిపోయింది. ఒక ప్రాక్టీస్ మ్యాచ్ కే  ఈ విధంగా భారీ స్థాయిలో జనం తరలి రావడం ఉత్సాహంగా నినాదాలు చేయడం నేనైతే ఎప్పుడు చూడలేదు. ముఖ్యంగా ధోని బ్యాటింగ్కు వచ్చిన ఆ క్షణం నా ఒంటి మీద రోమాలు నిక్కబడుచుకున్నాయి అంటూ స్టీఫెన్ ఫ్లెమింగ్ చెప్పుకొచ్చాడు.

 అయితే తాను మాత్రమే కాదు అక్కడున్న మిగతా కోచింగ్ సిబ్బంది ఆటగాళ్లు అందరూ కూడా ఆ అనుభూతిని చెంది ఉంటారు అంటూ చెప్పుకొచ్చాడు. నా జీవితంలో ఇది ఎంతో ప్రత్యేకమైన క్షణం అంటూ స్టీఫెన్ ఫ్లెమింగ్ తెలిపాడు. చెన్నై జట్టు పునరాగమనానికి ఇంతకు మించిన ఘనస్వాగతం మరొకటి ఉండదు అంటూ వ్యాఖ్యానించాడు. ఇకపోతే ఈ ఏడాది ఐపీఎల్ ముగిసిన తర్వాత చెన్నై జట్టు కెప్టెన్ గా ఉన్న ధోని ఇక ఐపీఎల్ నుంచి కూడా తప్పుకున్న ఛాన్స్ ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది. ఇటీవలే జట్టులోకి బెన్ స్టోక్స్ ని తీసుకున్న నేపథ్యంలో అతనికి చెన్నై జట్టు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే ఛాన్స్ కూడా ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది ఏం జరుగుతుందో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: