వన్డే వరల్డ్ కప్.. వాళ్లని ఐపిఎల్ ఆడొద్దని చెప్పేసిన బిసిసిఐ?

praveen
ప్రపంచ క్రికెట్లో ఎంతో పటిష్టమైన జట్టుగా కొనసాగుతున్న టీమిండియా జట్టు అటు వరల్డ్ కప్ గెలవక దాదాపు 15 ఏళ్లు గడిచిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆస్ట్రేలియా వేదికగా జరిగిన టి20 వరల్డ్ కప్ లో టైటిల్ గెలుస్తుంది అనుకున్నప్పటికీ సెమీఫైనన్లో ఓడిపోయి ఇంటిబాట పట్టింది. అయితే ఇక 2023 ఏడాదిలో అటు భారత్ వేదికగా జరగబోయే వన్డే వరల్డ్ కప్ లో మాత్రం తప్పకుండా టైటిల్ గెలవాలని పట్టుదలతో ఉంది టీమిండియా.

 ఈ క్రమంలోనే ఇక ఏడాది ప్రారంభం నుంచి భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ కు సంబంధించి అన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. ఇక అందుకు అనుగుణంగానే ముందుకు సాగాలని బీసీసీఐ నిర్ణయించింది అన్నది తెలుస్తుంది. ఈ క్రమంలోనే ఏకంగా వన్డే వరల్డ్ కప్ కోసం 20 మంది ఆటగాళ్లను బీసీసీఐ షార్ట్ లిస్ట్ చేసింది అనేది తెలుస్తుంది. ఇలా షార్ట్ లిస్టు చేసిన లిస్టులో ఉన్న ఆటగాళ్లు గాయాల బారిన పడకుండా ఉండేందుకు ఐపీఎల్ ఆడొద్దంటూ టాప్ ప్లేయర్లకు కూడా ఆదేశాలు జారీ చేసిందట బీసీసీఐ.

 ముంబైలోని ఒక సెవెన్ స్టార్ హోటల్లో జరిగిన బీసీసీఐ ప్రెస్ కాన్ఫరెన్స్ రివ్యూ మీటింగ్ లో ఇక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ మీటింగ్ కి ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ నేషనల్ క్రికెట్ అకాడమీ చైర్మన్ వివిఎస్ లక్ష్మణ్ మాజీ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ తో పాటు ఇక బోర్డు అధ్యక్షుడు రోజర్ బిన్నీ సైతం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరైనట్లు తెలుస్తోంది. ఈ ఏడాది టీమిండియా 35 వన్డే మ్యాచ్ లు ఆడబోతుంది. ఇందులో తొలత శ్రీలంకతో స్వదేశంలో వన్డే సిరీస్ జరగబోతుంది. భారత్లో జరిగే వన్ డే ప్రపంచ కప్ లోరూట్ మ్యాప్, అందుబాటులో ఉండే ఆటగాళ్లు, ఇక వర్క్ లోడ్ మేనేజ్మెంట్ వాటిపై చర్చించి బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: