భారత్ vs శ్రీలంక సిరీస్ లు.. ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చంటే?

praveen
కొత్త ఏడాదిలో క్రికెట్ ప్రేక్షకులందరికీ అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ అందించేందుకు టీమిండియా సిద్ధం అయిపోయింది అన్న విషయం తెలిసిందే  ఇక నేటి నుంచి అటు భారత పర్యటనకు వచ్చిన శ్రీలంకతో వరుస సిరీస్ లు ఆడబోతుంది టీమిండియా. ఈ క్రమంలోనే మొదట టి20 సిరీస్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక టి20 సిరీస్ లో భాగంగా హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో బరిలోకి దిగబోతుంది టీమిండియా. ఇక సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ,  రాహుల్ కు విశ్రాంతి ప్రకటించడంతో పూర్తిగా యువ ఆటగాళ్లతో కూడిన టీమిండియా శ్రీలంకతో పోటీ పడబోతుంది అని చెప్పాలి.

 ఇకపోతే నేడు ముంబై వేదికగా మొదటి టి20 మ్యాచ్ జరగబోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే శ్రీలంకతో జరిగే టి20 సిరీస్ వన్డే సిరీస్ మ్యాచ్లు ఎప్పుడు ఏ సమయంలో ప్రసరమవుతాయి ఎక్కడ ప్రత్యక్ష ప్రసారం చూడవచ్చు అన్న విషయంపై ఇక అభిమానులు కన్ఫ్యూజన్లో ఉన్నారు అని చెప్పాలి. ఇక ఆ వివరాలు చూసుకుంటే..
 టి20 సిరీస్ లో భాగంగా తొలి టీ20 మ్యాచ్ ముంబై వేదికగా జనవరి మూడవ తేదీన జరగబోతుంది.
 రెండో టి20 మ్యాచ్ పూనే వేదికగా జనవరి 5వ తేదీన గురువారం జరగనుంది అని చెప్పాలి.
 మూడవ టి20 మ్యాచ్ రాజ్కోట్ వేదికగా జనవరి 7వ తేదీన శనివారం నిర్వహించబోతున్నారు.
 ఇక వన్డే సిరీస్ విషయానికి వస్తే  :
 మొదటి వన్డే మ్యాచ్ గువహటి వేదికగా జనవరి 10వ తేదీన మంగళవారం జరగనుంది.
 రెండో వన్డే మ్యాచ్ కోల్కతా వేదికగా జనవరి 12వ తేదీన గురువారం జరిగనుంది.
 మూడో వన్డే మ్యాచ్ తిరువనంతపురం వేదికగా జనవరి 15వ తేదీన ఆదివారం జరగబోతుంది.
 ఇలా భారత్ వేదికగానే అన్ని మ్యాచ్లు జరుగుతాయి. ఇక ప్రత్యక్షంగా వీక్షించేందుకు కూడా అణువుగానే ఉంటుంది. అయితే టి20 మ్యాచ్ లు అన్ని రాత్రి 7 గంటలకు ప్రారంభం కానుండగా.. వన్డే మ్యాచ్లు మధ్యాహ్నం ఒకటిన్నర గంటలకు ప్రారంభమవుతాయి. ఇక మ్యాచ్లను అధికారిక బ్రాడ్కాస్టర్ గా భారత్ లో స్టార్ స్పోర్ట్స్ ప్రసారం చేయనుంది. డీస్నీ ప్లస్ హాట్ స్టార్ లో కూడా లైవ్ స్ట్రీమింగ్ చూసేందుకు అవకాశం ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: