పంత్ కారు ప్రమాదానికి.. అసలు కారణం అదేనట?

praveen
ఇటీవల టీమిండియా స్టార్ క్రికెటర్ రిషబ్ పంత్ కారు ప్రమాదానికి గురైన ఘటన ఎంత సంచలనంగా మారిపోయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఉత్తరప్రదేశ్ లో ఉన్న తన తల్లికి నూతన సంవత్సరం సందర్భంగా సర్ ప్రైస్ ఇచ్చేందుకు కారులో వెళ్తున్న సమయంలో ఊహించిన విధంగా రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఏకంగా రూర్కి వద్ద ఈ ఘోర ప్రమాదం జరిగింది అని చెప్పాలి. కారు అదుపుతప్పి పక్కనే ఉన్న డివైడర్ పైకి ఎక్కి దూసుకుపోయింది. ఈ ఘటనలో కారు అక్కడికక్కడే మంటల్లో కాలి బూడిదైంది అన్నవిషయం తెలిసిందే.

 ఈ ఘోర ప్రమాదం నుంచి అదృష్టవశాత్తు రిషబ్ పంత్ గాయాలతో బయటపడ్డాడు. ఇక ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నాడు అని చెప్పాలి.  అయితే ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు అని చెప్పాలి. రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి గల కారణం ఏంటి అన్న విషయంపై వివరాలు సేకరిస్తూ ఉన్నారు. కాగా స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. రిషబ్ పంత్ రోడ్డు ప్రమాదానికి ఇక రహదారిపై ఉన్న ఒక గుంతే కారణం అని తెలుస్తుంది. రవీంద్ర రాటి, పంకజ్ కుమార్, ప్రవీణ్ కుమార్ అనే స్థానికులు ఇటీవల మీడియాతో ఈ విషయాలను వెల్లడించారు.

 రిషబ్ పంత్ కారు యాక్సిడెంట్ కి గురైన ప్రాంతంలో గతంలో కూడా ఎన్నో ప్రమాదాలు జరిగాయని.. ఇక కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారంటూ స్థానికులు తెలిపారు. అయితే ఈ ప్రాంతంలో హైవే కాస్త ఇరుకుగా ఉంటుందని.. అంతేకాకుండా సర్వీస్ రోడ్డు కూడా ఇప్పటివరకు ఏర్పాటు కాలేదని చెప్పుకొచ్చారు. ఇక్కడున్న మలుపుల వద్ద డ్రైవర్లు తడబాటుకు గురవుతుంటారని.. ముఖ్యంగా రోడ్డుపై ఉండే గుంతలు ఎన్నో ప్రమాదాలకు కారణం అవుతూ ఉంటాయని చెప్పుకొచ్చారు. పంత్ కారు కూడా ఇలాగే గుంతలో పడే అదుపుతప్పి ప్రమాదానికి గురైనట్లు అభిప్రాయపడ్డారు. అయితే ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ దామి సైతం దీన్ని నిర్ధారించడం గమనార్హం. రోడ్డుపై ఉన్న గుంతను తప్పించబోయి పంత్ ప్రమాదానికి గురైనట్లు చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: