టీమిండియాకు కలిసిరాని 2022.. సూర్యకు కలిసొచ్చింది : ఆకాష్ చోప్రా

praveen
గత ఏడాదిలో ప్రపంచ క్రికెట్లో టి20 ఫార్మాట్లో సూపర్ స్టార్ గా మారిన ఆటగాడు ఎవరు అంటే అందరూ చెప్పేస్తారు భారత స్టార్ ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్ అని. కేవలం ఏడాది సమయంలోనే ప్రపంచవ్యాప్తంగా తన ఆట తీరుతో అభిమానులను సంపాదించుకున్నాడు సూర్య కుమార్. అంతే కాదు ప్రపంచ క్రికెట్లో నయ 360 ప్లేయర్ గా కూడా అవతరించాడు అన్న విషయం తెలిసిందే. మిగతా క్రికెటర్లు కనీసం సింగిల్స్ తీయడానికి కూడా కష్టపడి పోతున్న మైదానాల్లో సూర్య కుమార్ యాదవ్ మాత్రం స్టేడియం నలువైపులా ఎంతో అలవోకగా భారీ షాట్లు ఆడి పరుగులు రాబట్టిన తీరు ప్రతి క్రికెట్ ప్రేక్షకుడిని కూడా మంత్రముగ్ధుడిని  చేసింది అని చెప్పాలి.

 అద్భుతమైన ఆటతీరుతో ఏకంగా ఐసిసి టి20 ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని దక్కించుకున్నాడు సూర్య కుమార్ యాదవ్. ఇక అగ్రస్థానాన్ని  తన ప్రదర్శనతో ఇక పదిలం చేసుకుంటూనే వస్తూ ఉన్నాడు అన్న విషయం తెలిసిందే. అంతేకాదు ఇటీవల ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మెన్స్ టి20 క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు రేసులో ఉన్న ఆటగాళ్ల లిస్టును ప్రకటించగా భారత జట్టు నుంచి సూర్య యాదవ్ ఒక్కరు మాత్రమే ఇందులో చోటు సంపాదించుకోవడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇటీవలే మాజీ ఆటగాడు ఆకాష్ చోప్రా సూర్య కుమార్ యాదవ్ అసమాన్యమైన ప్రదర్శన పై స్పందిస్తూ ప్రశంసలు కురిపించాడు.

 2022 సంవత్సరం సూర్య కుమార్ దే అని గంట పదంగా చెప్పేసాడు ఆకాష్ చోప్రా.  ఫామ్ లేక చాలామంది క్రికెటర్లు ఇబ్బంది పడిన వేళ అటు సూర్య కుమార్ యాదవ్ మాత్రం తన కెరీర్ లోనే అత్యుత్తమమైన ప్రదర్శన చేశాడని ఆకాశ చోప్రా చెప్పుకొచ్చాడు. భారత జట్టుకు కలిసి రాని 2022 సంవత్సరం... సూర్యకుమార్కు మాత్రం బాగా కలిసి వచ్చింది. అతని స్థాయిని ప్రపంచ క్రికెట్లో అమాంతం పెంచేసింది. ఆసియా కప్, టి20 వరల్డ్ కప్ లో అతని ప్రదర్శన ఐసీసీ అత్యుత్తమ బ్యాటర్ల జాబితాలో అతనికి టాప్ ర్యాంక్ దక్కేలా చేసింది.  ఇక ఈసారి క్రికెటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును తప్పకుండా సూర్య కుమార్ యాదవ్ దక్కించుకుంటాడు అంటూ ఆకాశ చోప్రా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: