గడిచిన ఏడాది బాబర్.. ఈ ఏడాది సూర్యకుమారేనా?

praveen
అటు ఐసీసీ విడుదల చేసే ర్యాంకింగ్స్ ను తాము ఎప్పుడు పట్టించుకోబోము అని ప్రతి ఒక్క ఆటగాడు చెబుతూ ఉంటాడు. కానీ ఐసీసీ విడుదల చేసి ర్యాంకింగ్స్ లో మెరుగైన స్థానాన్ని సంపాదించుకునేందుకు ప్రతిక్షణం కష్టపడుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ర్యాంకులను పట్టించుకోము అని చెబుతూనే నెంబర్ వన్ ర్యాంకులో కొనసాగడానికి మాత్రం అత్యుత్తమమైన ప్రదర్శన చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే  కొత్త ఏడాది ప్రారంభమైంది. ఇక ఈ కొత్త ఏడాదిలో ఐసీసీ విడుదల చేసె ర్యాంకింగ్స్ లో మూడు ఫార్మాట్లలో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకోబోయేది ఎవరు అన్నది హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

 ఇక ప్రస్తుతం ఎంతో మంది మాజీ ఆటగాళ్లు, క్రికెట్ నిపుణులు కూడా దీని గురించి చర్చించుకుంటూ ఉండటం గమనార్హం. అయితే 2022 ఏడాది పూర్తయిన వేళ ఇక కొత్త ఏడాదిలో అటు ఎవరు కొత్తగా నెంబర్ వన్ గా మారిపోయేది ఎవరు అన్న విషయంపై చర్చ జరుగుతుంది. ఎంతోమంది ప్లేయర్ల పేర్లు వెలుగులోకి వస్తున్నాయి అని చెప్పాలి. అదే సమయంలో గత ఏడాది సహా అంతకుముందు వన్డే ఫార్మాట్లో నెంబర్ వన్ గా కొనసాగింది ఎవరు అన్నది కూడా చర్చించుకుంటున్నారు. ఈ క్రమంలోనే 2022 ఏడాది చివరి వరకు కూడా పాకిస్తాన్ కెప్టెన్ బాబర్ సాంగ్ నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు అని చెప్పాలి.

 ఇక అంతకుముందు 2013,2014, 2015, 2016 సంవత్సరాలలో దాదాపు వరుసగా నాలుగేళ్లపాటు ఏ బి డివిలియర్స్  ఇక వన్డే ఫార్మాట్ లో ఐసిసి ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని పదిలం చేసుకుంటూ అదిరిపోయే ప్రదర్శన చేశాడు. అయితే 2017 నుంచి 2020 వరకు కూడా అటు టీం ఇండియా బ్యాట్స్మెన్  విరాట్ కోహ్లీ వన్డే ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ బ్యాట్స్మెన్ గా కొనసాగాడు అని చెప్పాలి. ఇక 2021, 2022 సంవత్సరాలలో బాబర్ అజాం నెంబర్ వన్ స్థానంలో కొనసాగాడు. ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు 2023 సంవత్సరంలో నెంబర్వన్ బ్యాట్స్మెన్ అయ్యేది ఎవరు అన్నది ఆసక్తికరంగా మారిపోయింది. కాగా భారత స్టార్ బ్యాట్స్మెన్ సూర్యకుమార్ ఈ ఇయర్ నెంబర్ వన్ బ్యాట్స్మెన్ గా అవతరిస్తాడని అందరూ భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: