జట్టులో కోహ్లీ లేకపోవడంతో ఆశ్చర్యపోయా : సభా కరీం

praveen
కొత్త ఏడాదిలో కూడా వరుస సిరీస్ లతో బిజీ కాబోతుంది టీమిండియా. ఈ క్రమంలోనే ఈ ఏడాది మొదటి వారంలోనే అటు శ్రీలంకతో టి20 సిరీస్ ఆడబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత పర్యటనకు రాబోతున్న శ్రీలంకతో జనవరి మూడవతేదీ నుంచి టి20 సిరీస్ ఆడుతూ ఉండగా.. ఇక జనవరి 10వ తేదీ నుంచి వన్డే సిరీస్ కూడా ప్రారంభం కానుంది. కాగా అటు టి20 సిరీస్ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను హార్దిక్ పాండ్య నిర్వహిస్తూ ఉండగా.. ఇక రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ వన్డే సిరీస్ సారధిగా కొనసాగుతాడు. ఇప్పటికే జట్టుకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది అని చెప్పాలి.

 అయితే శ్రీలంకతో జరిగే టి20 సిరీస్ లో భాగంగా ప్రస్తుతం జట్టులో సీనియర్ ప్లేయర్లుగా కొనసాగుతున్న విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లకు చోటు దక్కలేదు. పూర్తిగా యువ ఆటగాళ్లతో నిండిన జట్టే అటు శ్రీలంకతో టి20 సిరీస్ లో తలబడబోతుంది అని చెప్పాలి. అయితే కోహ్లీకి టి20 జట్టులో చోటు దక్కకపోవడంపై భారత మాజీ ఆటగాడు సభా కరీం స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. శ్రీలంకతో  జరిగే టి20 సిరీస్ లో విరాట్ కోహ్లీకి మినహాయింపు ఇవ్వడం నాకైతే ఆశ్చర్యాన్ని కలిగించింది. అతనికి అంతర్జాతీయ టి20 లో ప్రత్యేకమైన పాత్ర ఇచ్చారు.

పొట్టి ఫార్మాట్లో విరాట్ కోహ్లీ తిరుగులేని ఆటగాడు.  కోహ్లీ టి20 ప్రపంచ కప్ లో ఆడకపోతే మనం పాకిస్థాన్ పై ఓడిపోయేవాళ్ళం అంటూ సభాకరీమ్ వ్యాఖ్యానించాడు.  ఈ ఫార్మాట్లో అతను జట్టుకు గొప్ప స్థిరత్వాన్ని అందించాడు. అయితే శ్రీలంకతో టి20 సిరీస్ లో ఎంపికవ్వని ఆటగాళ్లు.. మళ్లీ టి20 జట్టులోకి రాలేరని మాత్రం అస్సలు అనుకోవద్దు. కుర్రాల్లు రాణించకపోతే వారి స్థానాలను భర్తీ చేయవలసింది మళ్లీ పాత ఆటగాళ్లతోనే అంటూ సభాకరిం చెప్పుకొచ్చాడు. అయితే అటు సీనియర్ ప్లేయర్ రాహుల్ వచ్చే నెలలో తన ప్రియురాలితో వివాహం నేపథ్యంలో లీవ్ తీసుకున్నాడు అన్నది తెలుస్తుంది.  కానీ కోహ్లీ గైర్హాజర్ కి సంబంధించి కారణం ఏంటి అన్నది మాత్రం క్లారిటీ రాలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: