ఐపీఎల్ ఎంతో మంది జీవితాలను మార్చేసింది : ఎబిడి

praveen
ఇండియన్ ఫ్యాన్స్ అమితంగా అభిమానించే విదేశీ క్రికెటర్లలో ఏబీ డివిలియర్స్ కూడా ఒకరు అన్న విషయం తెలిసిందే. ఐపీఎల్ లో ఆడటం ద్వారా భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ ఎంతగానో దగ్గరయ్యాడు ఎబి డివిలియర్స్. మిస్టర్ 360 డిగ్రీస్ ప్లేయర్గా ఐపీఎల్లో ఎన్నో అద్భుతమైన ఇన్నింగ్స్ లు ఆడాడు అనే విషయం తెలిసిందే. అసమాన్యమైన ఇన్నింగ్స్ లతో ఐపీఎల్లో స్టార్ ప్లేయర్గా నిలిచాడు. ప్రారంభం సమయంలో కొన్ని సీజన్ల పాటు ఢిల్లీ తరపున ఆడిన ఏబి డివిలియర్స్ ఆ తర్వాత ఎక్కువ కాలం పాటు బెంగళూరు జట్టు తరఫున ఆడాడు. ఇక గత ఏడాది ఐపీఎల్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే బీసీసీఐ నిర్వహించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెటర్లకు ఎంతలా ఉపయోగపడుతుంది అన్న విషయాన్ని ఇటీవల  డివిలియర్స్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. తనతో పాటు ఎంతోమంది ఇతర క్రికెటర్ల జీవితాలను కూడా ఐపీఎల్ మార్చేసింది అన్న విషయాన్ని చెప్పుకొచ్చాడు ఏబిడి. ఐపీఎల్ ప్రారంభ రోజుల్లో ఏకంగా ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు గ్లెన్ మెక్ గ్రాత్ తో డ్రెస్సింగ్ రూమ్  పంచుకోవడం అనేది నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని విషయం. నాకే కాదు ఎంతో మంది ఇతర ఆటగాళ్లకు కూడా అది ఒక గొప్ప సందర్భం.

 భారత్లో ప్రజలు క్రికెట్ పై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. స్వదేశీ జట్టుతో పాటు ఇతర జట్లలోని ఆటగాళ్లకి కూడా మద్దతు ప్రకటిస్తూ ఉంటారు. ఇక నాకు ప్రత్యేకంగా అనిపించే విషయం ఒక్కటే.. నేను కలుసుకున్న వ్యక్తులు. ముఖ్యంగా గ్లెన్ మెక్ గ్రాఫ్ తో కొంత సమయం గడిపాను. అతని డ్రెస్సింగ్ రూమ్ లో బీరు తాగాను అంటూ ఏబీడీవిలియర్స్ చెప్పుకొచ్చాడు. కాగా  ఇద్దరు కూడా ఐపీఎల్ మొదటి రెండు సీజన్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ తరఫున ప్రాతినిధ్యం వహించారు. ఐపీఎల్ నుంచి తప్పకున్న ఏబి డివిలియర్స్ మళ్ళీ రీఎంట్రీ ఇస్తే బాగుండని అభిమానులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

Abd

సంబంధిత వార్తలు: