బాబర్ తలతిక్క నిర్ణయం.. చివరికి ఒక్క విజయం కూడా దక్కలేదు?

praveen
ప్రస్తుతం భారత దయాది దేశమైన పాకిస్తాన్ జట్టు వరుసగా టెస్ట్ సిరీస్ లు ఆడుతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాకిస్తాన్ పర్యటనకు వస్తున్న అన్ని జట్లు కూడా అటు పాకిస్తాన్ పై సొంతగడ్డపైనే ఆదిపత్యం చెలాయిస్తూ ఉండడం గమనార్హం. మొన్నటికిమొన్న ఏకంగా పాకిస్తాన్ గడ్డపై ఎన్నో ఏళ్ల తర్వాత అడుగుపెట్టిన ఇంగ్లాండ్ జట్టు  విధ్వంసకరమైన ఆటతీరుతో ఆధిపత్యాన్ని చలాయించింది. మూడు మ్యాచ్ ల టెస్టు సిరీస్ లో మూడు మ్యాచ్ లలో గెలిచి సత్తా చాటింది. దీంతో ఇంగ్లాండ్ చేతిలో ఘోర పరాభవాన్ని చవిచూసిన పాకిస్తాన్ జట్టు ఇక ఇప్పుడు న్యూజిలాండ్ తో టెస్ట్ సిరీస్ ఆడుతోంది అన్న విషయం తెలిసిందే.

 ఇటీవలే పాకిస్తాన్ న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్ట్ డ్రాగ ముగిసింది. పాకిస్తాన్ నిర్దేశించిన 138 పరుగుల లక్ష్యాన్ని చేదించేందుకు అటు కివీస్ బ్యాటర్లు  ప్రయత్నిస్తుండగా ఎంపైర్లు కలగజేసుకొని డ్రాగ ముగించడం గమనార్హం. అయితే చివరి రోజు ఆఖరి సెషన్ లో 50 నిమిషాలు సమయం ఉందనంగా పాకిస్తాన్ జట్టు ఇన్నింగ్స్ డిక్లేర్ చేయడం గమనార్హం. అయితే తక్కువ సమయం ఉండడంతో గ్రీజులోకి వచ్చిన న్యూజిలాండ్ బ్యాట్స్మెన్లు సిక్సర్లు ఫోర్ లతో చెలరేగిపోయారు. ఒకరకంగా పాకిస్తాన్ ఆటగాళ్లకే అటు అభిమానులకు కూడా ఓటమి భయం కలిగించారు అని చెప్పాలి. ఇక ఇంతలో కల్పించుకున్న పాకిస్తాన్ అంపైర్ అలీమ్ దార్ బ్యాడ్ లైట్ కారణంగా చూపుతూ మ్యాచ్ డ్రాగ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

 అక్కడే కొంత డ్రామా జరిగింది అని చెప్పాలి. అయితే పాక్ సారధి బాబర్ తీసుకున్న నిర్ణయమే చివరికి మ్యాచ్ డ్రాగ ముగియడానికి కారణమైంది అన్నది తెలుస్తుంది. వాస్తవానికి మ్యాచ్ డ్రాగ ముగియడం ఖాయం. అలాంటి సమయంలో పాక్ సారధి బాబర్ తల తిక్క నిర్ణయం తీసుకున్నాడు 15 ఓవర్లలో కివీస్ బ్యాటర్లను అలౌడ్ చేయగలం అన్నట్లుగా వెనక్కి వచ్చేయండి అంటూ క్రీజు లో ఉన్న పాకిస్తాన్ బ్యాట్స్మెన్లను ఆదేశించాడు. ఆ సమయంలో న్యూజిలాండ్ విజయం సాధించాలంటే 90 పంతులు 1038 పరుగులు చేయాలి. కానీ అలా జరగలేదు. చివరికి మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో బాబర్ తల తిక్క నిర్ణయం కారణంగా పాకిస్తాన్ స్వదేశంలో ఈ ఏడాది ఒక్క విజయం కూడా లేకుండానే ముగిసినట్లుగా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: