జట్టును నాశనం చేయకండి.. సన్రైజర్స్ యాజమాన్యంపై మాజీ ప్లేయర్ ఫైర్?

praveen
ఎలాంటి అంచనాలు లేకుండా ఐపిఎల్ లో బరిలోకి దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తక్కువ సమయంలోనే డిఫెండింగ్  ఛాంపియన్గా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న విషయం తెలిసిందే. ఏకంగా ఐపీఎల్ లోకి వచ్చిన తక్కువ సమయంలోనే ఐపిఎల్ టైటిల్ గెలిచి ఛాంపియన్ జట్లకు సైతం ఇచ్చారు. ఆ సమయంలో జట్టుకు కెప్టెన్ గా ఉండే డేవిడ్ వార్నర్ ఒకవైపు ఆటగాడిగా మరోవైపు సారధిగా కూడా జట్టును ఎంతో సమర్థవంతంగా ముందుకు నడిపించాడు. కానీ ఆ తర్వాత కాలంలో మాత్రం సన్రైజర్స్ తన ప్రభావాన్ని క్రమక్రమంగా కోల్పోతూ కనిపిస్తుంది అని చెప్పాలి.

 వీరోచిత పోరాటంతో జట్టుకు ఒకసారి టైటిల్ అందించిన డేవిడ్ వార్నర్ను జట్టు యాజమాన్యం వదిలేయడం.. జట్టుకు ఎన్నోసార్లు అనూహ్యమైన  విజయాలను అందించిన రషీద్ ఖాన్ లాంటి వాళ్ళని వదులుకోవడం.. ఏకంగా ప్రపంచ క్రికెట్లో బెస్ట్ కెప్టెన్గా పేరు సంపాదించుకున్న కేన్ విలియమ్సన్ లాంటి ప్లేయర్లను సైతం జట్టు నుంచి బయటకు పంపించడం.. ఇక కొత్త ఆటగాళ్లని జట్టులోకి తీసుకోవడం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ క్రమంలోనే ఇటీవల ఇదే విషయంపై సన్రైజర్స్ మాజీ ఆటగాడు మహమ్మద్ నభి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

 ఇప్పటికైనా సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు యాజమాన్యం తీరు మార్చుకోవాలి అంటూ హితవు పలకడం గమనార్హం. జట్టును నాశనం చేయడానికి బదులు పటిష్టం చేయడానికి ప్రయత్నిస్తే బాగుంటుంది. ఎందుకంటే ఐపీఎల్ లో పేరున్న ఫ్రాంచైజీగా మీరు చేయాల్సిన మొట్టమొదటి పని అదే అంటూ చురకలు అంటించాడు. తరచూ జట్టులో మార్పులు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ మెరుగైన జట్టు నిర్మాణానికి పాటుపడితే బాగుంటుంది. ఇక ఐదేళ్లపాటు సన్రైజర్స్ కు బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్న రషీద్ ఖాన్ ను వదులుకున్నారు. రషీద్ ఖాన్ ఒక్కడినే కాదు ఎంతోమంది టాప్ ప్లేయర్ల పట్ల ఇదే వైఖరితో సన్రైజర్స్ ముందుకు సాగింది. కానీ అలా చేయకుండా ఉంటే బాగుండేది. కనీసం వాళ్లకేం కావాలో వాళ్లకైనా అర్థమవుతుందో లేదో అంటూ మహమ్మద్ నభి వ్యాఖ్యానించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: