ఐదుగురు 5 పరుగులు చేయలేదు.. ఇంకెలా గెలుస్తారు?

praveen
ప్రస్తుతం బిగ్ బాష్ లీగ్ లో భాగంగా ప్రతి మ్యాచ్ కూడా ఉత్కంఠ భరితంగా జరుగుతుంది అని చెప్పాలి. అయితే కొన్ని మ్యాచ్లు నువ్వా నేను అన్నట్లుగా సాగుతూ ఉంటే మరి కొన్ని మ్యాచ్ లు ఏకపక్షంగా సాగుతూ ఉన్నాయి అని చెప్పాలి. బిగ్ బాష్ లీగ్ లో భాగంగా మెల్ బోర్న్ రెన గేట్స్, సిడ్నీ సిక్సర్స్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా ఇలా ఏకపక్షంగా సాగింది అని చెప్పాలి. ఈ మ్యాచ్ లో భాగంగా మొదట టాస్ గెలిచిన మేల్ బోర్న్ జట్టు  బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలోనే మొదట సిడ్నీ సిక్సర్స్ జట్టు ఇక బ్యాటింగ్ చేయడానికి వచ్చింది. కాగా సిడ్ని ఓపెనర్ జోష్ ఫిలిప్స్ 55 పరుగులతో శుభారంభం చేశాడు అని చెప్పాలి. మరో ఓపనరు కర్టిస్ ఫ్యాటర్సన్ 17 పరుగులతో ఓకే ఓకే బ్యాటింగ్ చేశాడు.

 ఇక వీళ్ల తర్వాత వచ్చిన జేమ్స్ విన్స్ 26, జోర్దాన సిల్క్ 19 పరుగులు రాణించారు. అయితే ఈ నలుగురు మినహా మిగతా బ్యాట్స్మెన్లు పెద్దగా రాణించలేదు. కెప్టెన్ మోజెస్ హెన్రిక్స్ (1), డాన్ క్రిస్టియన్ (7), హేడెన్ కెర్ (1), బెన్ డ్వార్షూయిస్ (6 నాటౌట్), షాన్ ఆబాట్ (1), జాక్సన్ బర్డ్ (13 నాటౌట్) పేలవ ప్రదర్శన చేశారు. దీంతో సిడ్నీ సిక్సర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 149 పరుగులు అతి కష్టం మీద చేయగలిగింది. ఆ తర్వాత స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన మెల్బోర్న్ రెన గేట్స్ జట్టు ఎంతో అలవోకక విజయం సాధిస్తుందని అందరూ అనుకున్నారు.

 కానీ ఆ జట్టుకు శుభారంభం దక్కలేదు అని చెప్పాలి. ఓపెనర్ మార్టిన్ గాప్తిల్ పరుగుల ఖాతా తెరవకుండానే పేవిలియన్ చేరాడు. మరో ఓపెనర్ నిక్ మాడిసన్ కేవలం ఒకే ఒక పరుగులు చేసి ఘోరంగా విఫలమయ్యాడు అని చెప్పాలి. ఆ తర్వాత ఆరోన్ ఫించ్ (36), షాన్ మార్ష్ (28) జట్టును గెలిపించేందుకు పోరాటం సాధించారు. మిగతా బ్యాట్స్మెన్లు అందరూ చేతులెత్తేసారు. జొనాథన్ వెల్స్ (1), పీటర్ హాండ్స్‌కోంబ్ (3), అకీల్ హొస్సేన్ (3), కేన్ రిచర్డ్‌సన్ (8), ముజీబ్ ఉర్ రెహ్మాన్ (0) తీవ్రంగా నిరాశపరిచారు. చివర్లో విల్ సదర్‌ల్యాండ్ (13), టామ్ రాజర్స్ (14 నాటౌట్) పోరాడిన ఫలితం లేకుండా పోయింది. దీంతో ఆ జట్టు 19 ఓవర్లలో 115 పరుగులకే ఆలౌట్ అయింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: