సూర్య కుమార్ నాకు పెద్దన్నలాంటివాడు : శామ్స్ మూలని

praveen
గత కొంతకాలం నుంచి టీమ్ ఇండియాలో హాట్ టాపిక్ గా మారిపోయిన క్రికెటర్ ఒకరే . అతను ఎవరో కాదు మిస్టర్ 360 ప్లేయర్ సూర్య కుమార్ యాదవ్. తన అద్భుతమైన ఆట తీరుతో ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా మంత్రముగ్ధుల్ని  చేస్తూ ప్రస్తుతం దూసుకుపోతున్నాడు అని చెప్పాలి. అంతేకాదు భారత జట్టులోకి వచ్చిన కేవలం ఏడాది కాలంలోనే ఇక అసమాన్యమైన ప్రదర్శన చూస్తూ ఏకంగా ఐసిసి ర్యాంకింగ్స్ లో నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకున్నాడు సూర్య కుమార్ యాదవ్.

 ఈ క్రమంలోనే స్టార్ బౌలర్ల బౌలింగ్లో సైతం ఎంతో అలవోకగా షాట్లు ఆడుతూ అందరిని మెస్మరైస్ చేస్తూ ఉంటాడు అని చెప్పాలి. ఇక మిగతా బ్యాట్స్మెన్లు కనీసం సింగిల్స్ తీయడానికి కూడా కష్టపడి పోతున్న సమయంలో అటు సూర్య కుమార్ యాదవ్ మాత్రం మైదానం నలువైపులా కూడా ఎంతో అలవోకగా షాట్లు ఆడుతూ అదరగొడుతున్నాడు. ఇలా తన ఆటతీరుతో తక్కువ సమయంలోనే టీమ్ ఇండియాలో నాలుగవ స్థానంలో నమ్మదగిన బ్యాట్స్మెన్ గా మారిపోయాడు అని చెప్పాలి. ఇలా ప్రస్తుతం టీమిండియాలో అగ్రశ్రేణి బ్యాట్స్మెన్ గా కొనసాగుతున్న సూర్య కుమార్ తనకు పెద్దన్నయ్య లాంటివాడు అంటూ యువ ఆల్రౌండర్ శ్యామ్స్ మూలాని చెప్పుకొచ్చాడు.

 సూర్య కుమార్ యాదవ్ తనకు ఎప్పుడూ మార్గ నిర్దేశం చేస్తూ ఉంటాడు అంటూ తెలిపాడు. తాను కెరియర్ లో ఎదిగేందుకు ఎప్పుడు సూర్యకుమార్ యాదవ్ నుంచి మంచి సహకారం లభిస్తుంది అంటూ చెప్పుకొచ్చాడు శ్యామ్స్ మూలాని. ఇటీవల జరిగిన మినీ వేలంలో ముంబై ఇండియన్స్ జట్టు తనను 20 లక్షలకు కొనుగోలు చేసిన కేవలం నిమిషాల వ్యవధిలోనే సూర్య కుమార్ యాదవ్ ఫోన్ చేసి అభినందనలు తెలిపాడు అంటూ శ్యామ్స్ ములని చెప్పుకొచ్చాడు  అతను నాకు పెద్దన్నయ్య లాంటివాడని ఇక తన క్రికెట్ ప్రయాణాన్ని ఎప్పుడు గమనిస్తూనే ఉంటాడు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: