అది నా జట్టు.. టైటిల్ గెలిస్తే చూడాలని ఉంది : క్రిస్ గేల్

praveen
యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్.. ఈ ఆటగాడి గురించి ప్రపంచ క్రికెట్ ప్రేక్షకులకు పరిచయం చేస్తే అది అతిశయోక్తి అవుతుంది అని చెప్పాలి . ఎందుకంటే  ఒకవైపు వెస్టిండీస్ జట్టు తరుపున మరోవైపు ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో క్రిస్ గేల్ సృష్టించిన విధ్వంసం అలాంటిది అని చెప్పాలి. అయితే అతను ఎన్నో ఏళ్ల పాటు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టులో కొనసాగాడు. ఇక ఆ తర్వాత రాయల్ చాలెంజ్ బెంగళూరు జట్టు వేలంలోకి వదిలేయడంతో ఇతర ఫ్రాంచైజీల  తరఫున కూడా ప్రస్తానాన్ని కొనసాగించాడు.

 కానీ ఇప్పటికీ క్రిస్ గేల్ అనే పేరు వినిపించింది అంటే చాలు అతను రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సంబంధించిన ఆటగాడే అని ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది అని చెప్పాలి. ఇక అటు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ బెంగళూరు జట్టుతో తనకున్న ప్రత్యేకమైన అనుబంధాన్ని ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే ఇటీవల ఒక స్పోర్ట్స్ ఛానల్  ఇంటర్వ్యూలో పాల్గొన్న క్రిస్ గేల్ అటు బెంగళూరు జట్టుతో తన మధుర జ్ఞాపకాల గురించి గుర్తు చేసుకున్నాడు అని చెప్పాలి. విరాట్ కోహ్లీ, ఏబి డివిలియర్స్ తో ఉన్న రిలేషన్షిప్ గురించి చెప్పమని అడిగితే ఆసక్తికర సమాధానం చెప్పాడు.

 నేను కేవలం విరాట్ కోహ్లీ, ఏబి డివిలియర్స్ తో మాత్రమే కాదు ఇక జట్టులోని  ఇతర ఆటగాళ్లతో కూడా గొప్ప క్షణాలను పొందాను. అయితే ఆర్ సిబి లో సర్పరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్ లని కలిసా. ఇక ఆ కుర్రాళ్ళు కూడా అద్భుతంగా ఉన్నారు. ఇక స్టార్ ప్లేయర్లు కోహ్లీ ఏపీ డివిలియర్స్ తో కలిసి డ్రెస్సింగ్ రూమ్ పంచుకోవడం ఎంతో బాగుంది. మేమందరం ఎక్కడ ఈగో చూపించకుండా ఒకరిని చూసి మరొకరు నేర్చుకునే వాళ్ళం. మేము ట్రోఫీ పీని గెలవాలనుకున్న కానీ  జరగలేదు. ఆర్సిబి ఒక్కసారైనా ట్రోఫీ గెలవడం నేను చూడాలనుకుంటున్నాను. ఇక ఎప్పుడు బెంగళూరు టీం ని నా జట్టుగానే భావిస్తూ ఉంటాను. నేను ఆ ఫ్రాంచైజీని ఎప్పటికి ప్రేమిస్తూనే ఉంటాను అంటూ క్రిస్ గేల్ సమాధానం చెప్పాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: