ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్.. అక్షర్ పటేల్ కు కెరియర్ లోనే బెస్ట్ ర్యాంక్?

praveen
ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో ఉన్న భారత జట్టు అక్కడ వన్డే సిరీస్ లో తీవ్రంగా నిరాశపరిచింది అన్న విషయం తెలిసిందే. వరుసగా రెండు మ్యాచ్లలో  ఓడిపోయి వన్డే సిరీస్ ఇక బంగ్లాదేశ్ చేతిలో పెట్టేసింది. ఇక మూడో మ్యాచ్లో ఘనవిజయాన్ని సాధించినప్పటికీ అది నామమాత్రమైన మ్యాచ్ కావడంతో ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. అయితే వన్డే సిరీస్ లో నిరాశపరిచిన టీమ్ ఇండియా జట్టు టెస్ట్ సిరీస్ లో మాత్రం అద్భుతంగా రాణిస్తుంది అని చెప్పాలి. ఇప్పటికే 188 పరుగులు తేడాతో విజయం సాధించి అదరగొట్టింది అన్న విషయం తెలిసిందే.  ఇక ఇప్పుడు రెండవ టెస్టులో కూడా అదే ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ అదరగొడుతుంది టీమిండియా జట్టు.

 జట్టులో ఉన్న ఆటగాళ్లందరూ కూడా మంచి ఫామ్ లో కనిపిస్తున్న నేపథ్యంలో తమ ప్రదర్శనతో ఎన్నో రికార్డులు కూడా కొల్లగొడుతున్నారు అని చెప్పాలి. ఇకపోతే ఇటీవల ఐసీసీ విడుదల చేసిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో భారత ఆటగాళ్లు సత్తా చాటారు అని చెప్పాలి. ఇక కొంతమంది ఆటగాళ్లయితే తమ కెరియర్ లోనే మెరుగైన ర్యాంకులను సొంతం చేసుకోవడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇక ఇటీవల బంగ్లాదేశ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో మంచి ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న ఆల్రౌండర్ అక్షర్ పటేల్ కెరియర్ లోనే అత్యుత్తమ ర్యాంకును సొంతం చేసుకున్నాడు.

 బంగ్లాదేశ్ తో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్లో మంచి ప్రదర్శన చేసిన అక్షర పటేల్ ఒకేసారి 20 స్థానాలు మెరుగుపరచుకొని 18వ ర్యాంకును సొంతం చేసుకున్నాడు అని చెప్పాలి. ఇక బంగ్లాదేశ్ మొదటి టెస్ట్ మ్యాచ్ లో ఆల్ రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకుని మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన కుల్దీప్ యాదవ్ టాప్ 50 లో చోటు సంపాదించుకున్నాడు. భారత బౌలర్లో బుమ్రా అశ్విని వరుసగా నాలుగు ఐదు స్థానాల్లో కొనసాగుతున్నారు. ఇక బంగ్లా తో టోలి టెస్టులో శతకం, అర్థ శతకం సాధించిన పూజార 10 స్థానాలు ఎగబాకి 16వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు అని చెప్పాలి. ఇక మొదటి మ్యాచ్ లో రాణించిన శ్రేయస్సు  11 స్థానాలు ఏగబాకి 20వ ర్యాంకులో ఉండగా   రిషబ్ పంత్ ఆరవ ర్యాంకు, రోహిత్ శర్మ 9వ ర్యాంకు, విరాట్ కోహ్లీ 12 ర్యాంకులలో కొనసాగుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: