సంజూ శాంసన్‌ చెలరేగిపోయాడు... ఏం లాభం అంటున్న ఫాన్స్!

praveen
అవును, సంజూ శాంసన్‌ వరుస హాఫ్‌ సెంచరీలతో దుమ్ములేపుతున్నాడు. రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో ఈ కేరళ కెప్టెన్‌ ఇరగదీస్తున్నాడు. జార్ఖండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌ లో బ్లాస్టింగ్‌ ఇన్నింగ్స్‌ షురూ చేసాడు. 108 బంతుల్లో 72; 4 ఫోర్లు, 7 సిక్సర్లు ఆడిన సంజూ తాజాగా రాజస్తాన్‌ తో జరుగుతున్న మ్యాచ్‌లో కూడా అదే రిపీట్ చేసాడు. తొలి ఇన్నింగ్స్‌ లో 108 బంతులు ఎదుర్కొన్న సంజు 14 ఫోర్ల సాయం తో 82 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. సంజూతో పాటు సచిన్‌ బేబి 67 పరుగులు చేసి నాటౌట్‌ గా నిలిచాడు.
కాగా సంజు అర్ధ సెంచరీల తో విరుచుకు పడడం తో 2వ రోజు రెండో సెషన్‌ సమయానికి కేరళ తొలి ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి గాను 50 ఓవెన్లకి 184 పరుగులు చేసింది. ఓపెనర్లు అయినటువంటి పొన్నన్‌ రాహుల్‌ (10), రోహన్‌ ప్రేమ్‌ (18) చాలా పేలవమైన ఆటతీరుని పదర్శించారు. ఇక షౌన్‌ రోజర్‌ అయితే డకౌట్‌ అయ్యి నిముషాల వ్యవధిలో వెనుదిరిగాడు. కాగా ప్రస్తుతం సచిన్‌కు జతగా అక్షయ్‌ చంద్రన్‌ (3) క్రీజ్‌లో ఆడుతున్నాడు.
ఇదిలా ఉంటే, సంజూ శాంసన్‌ రంజీల్లో వరుస అర్ధ సెంచరీలతో రెచ్చిపోవడం తో అతని ఫ్యాన్స్‌ విచిత్ర రీతిలో స్పందిస్తున్నారు. తమ ఆరాధ్య క్రికెటర్‌ అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో రాణిస్తేనే చోటివ్వని భారత సెలెక్టర్లు.. రంజీల్లో హాఫ్‌ సెంచరీలు బాదితే మాత్రం ఏం లాభం? జాతీయ జట్టులో చోటిస్తారా ఏమిటి? అంటూ సెటైర్లు వేస్తున్నారు. అంతే కాదు సంజూ హాఫ్‌ సెంచరీలు కాదు ట్రిపుల్‌ సెంచరీలు కొట్టినా టీమిండియా యాజమాన్యం అస్సలు గుర్తించాడు అంటూ వ్యంగ్యంగా స్పందిస్తున్నారు. ఇక పోతే అభిమానుల నుంచి ఎంత ఒత్తిడి ఎదురైనా సెలెక్టర్లు మాత్రం సంజూను జాతీయ జట్టుకు ఎంపిక చేయక పోవడం కొసమెరుపు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: