రెండో టెస్ట్ మ్యాచ్.. పూజారా, అక్షర్ ను ఊరిస్తున్న అరుదైన రికార్డులు?

praveen
ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా టెస్ట్ సిరీస్ లో బిజీబిజీగా ఉంది టీమిండియా జట్టు. ఈ క్రమంలోని ఇటీవల మొదటి టెస్ట్ మ్యాచ్ ముగించుకుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ లో భాగంగా 188 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది టీమిండియా జట్టు. ఇలా మొదటి టెస్ట్ మ్యాచ్ విజయం సాధించిన జోరులో ఇక ఇప్పుడు రెండవ టెస్ట్ మ్యాచ్ కూడా అదరగొట్టేందుకు సిద్ధం అవుతుంది అని చెప్పాలి. డిసెంబర్ 22వ తేదీన మీర్ పూర్  వేదికగా రెండవ టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కాబోతుంది.

 ఈ క్రమంలోనే ఈ మ్యాచ్ కోసం ప్రస్తుతం టీమిండియా ప్రాక్టీస్ లో మునిగి తేలుతూ ఉంది అని చెప్పాలి. ఇక రెండు మ్యాచ్ల సిరీస్ లోనికి ఏకంగా బంగ్లాదేశ్ వారి సొంత గడ్డపైనే ఓడించాలి అని భారత్ ఎన్నో ఆశలు పెట్టుకుంది. అదే సమయంలో  వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ పోరులో కూడా తమ స్థానాన్ని మరింత మెరుగుపరచుకోవాలని భావిస్తుంది ఇండియా జట్టు. ఒకవేళ బంగ్లాదేశ్ ను క్లీన్ స్వీప్ చేస్తే కనుక వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ పోరు అవకాశాలు  మరింత మెరుగవుతాయి.  ఈ క్రమంలోనే టీమ్ ఇండియా ప్రదర్శన ఎలా ఉండబోతుంది అన్నది మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి.

 ఇదిలా ఉంటే.. ఇక రెండో టెస్టు మ్యాచ్లో భారత జట్టులో ఉన్న కీలక ఆటగాళ్లను ఎన్నో అరుదైన రికార్డులు ఊరిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. మొదటి టెస్ట్ మ్యాచ్ లో తమ ప్రదర్శనతో ఆకట్టుకున్న టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ చటేశ్వర పూజారా ఆల్ రౌండ్ అక్షర్ పటేల్, aరుదైన రికార్డులు ఊరిస్తూ ఉన్నాయి అని చెప్పాలి. పూజార మరో పదహారు పరుగులు చేశాడంటే టెస్ట్ క్రికెట్ 7వేల పరుగులు పూర్తి చేరుకుంటాడు. ఇక టీమిండియా ఆల్రౌండర్  అక్షర్ పటేల్ రెండవ టెస్టులో ఆరు వికెట్లు తీసాడు అంటే టెస్టుల్లో అత్యంత వేగంగా 50 వికెట్ల తీసిన  భారత బౌలర్గా అరుదైన రికార్డు సృష్టిస్తాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: