13 ఏళ్ల కుర్రాడి విధ్వంసం.. ఒక్కడే 400 పరుగులు చేశాడు?

praveen
ఇటీవలకాలంలో భారత్లో కొత్త ప్రతిభ కు కొదవ లేకుండా పోయింది అన్న విషయం తెలిసిందే. ఎంతో మంది యువ ఆటగాళ్ళు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటూ తన సత్తా ఏంటో చూపిస్తూ ఉన్నారు. కొంతమంది బౌలింగ్ తో అదరగొడుతూ ఉంటే మరి కొంతమంది బ్యాటింగ్లో వీరవిహారం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే  ఇటీవల కాలంలో దేశవాళీ టోర్నీలలో ఎంతో మంది యువ ఆటగాళ్లు ఆకట్టుకునే ప్రదర్శన చేస్తూ ఉండడం మాత్రం సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ గా  మారిపోయింది అని చెప్పాలి.

 ఇక ఇప్పుడు ఇలాంటి ఒక ప్రతిభగల కుర్రాడు గురించిన వార్త కాస్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారిపోయింది అని చెప్పాలి. 13 ఏళ్ల కుర్రాడు తన్మయ్ సింగ్ ఇటీవల తన అద్భుతమైన బ్యాటింగ్ తో అందరిని అవాక్కయ్యేలా చేశాడు. గ్రేటర్ నోయిడా వేదికగా జరుగుతున్న అండర్ 14  క్లబ్ క్రికెట్ టోర్నీలో తన బ్యాటింగ్ విశ్వరూపం ప్రదర్శించాడు అని చెప్పాలి. ర్యాన్ క్రికెట్ అకాడమీ తో జరిగిన మ్యాచ్లో దేవరాజ్ స్పోర్ట్స్ క్లబ్ కి ప్రాతినిధ్యం వహించాడు. బ్యాటింగ్ తో అదరగొట్టాడు. 132 బంతుల్లోనే 30 ఫోర్లు, 38 సిక్సర్లతో  ఏకంగా ఒక్కడే 401 పరుగులు సాధించాడు.

 ఈ క్రమంలోనే తన బ్యాటింగ్ తో అందరినీ ఆశ్చర్యపరిచిన తన్మయ్ మాజీ ఆటగాళ్లు సచిన్ టెండూల్కర్ వినోద్ కాంబ్లీ యువ ఆటగాళ్లు పృద్వి షా, సర్ఫరాజ్ ఖాన్ లను గుర్తు చేశాడు అని చెప్పాలి. అంతేకాదు తన అద్భుతమైన ప్రదర్శనతో భవిష్యత్తులో టీమిండియా తరఫున ఆడేందుకు మంచి పునాది వేసుకున్నాడు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఈ యువ ఆటగాడి ప్రతిభ గురించి తెలిసి ప్రతి ఒక్కరు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. కొంతమంది మాజీ ఆటగాళ్లు సైతం ఈ కుర్రాడు సృష్టించిన విధ్వంసానికి మంత్రముగ్దులు అవుతున్నారు అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: