అర్జెంటినా గెలిచిందని.. అభిమాని ఏం చేసాడో తెలుసా?

praveen
సాధారణంగా ఎంతో మంది క్రీడాభిమానులు ఇక మ్యాచ్ జరుగుతుందంటే చాలు స్టేడియం కు వెళ్లి ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే మన దేశంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతుంది అంటే మాత్రమే కాదు ఏకంగా ఫుట్బాల్ మ్యాచ్ జరుగుతుంది అన్న విదేశాలకు వెళ్లి ప్రత్యక్షంగా మ్యాచ్ వీక్షించడానికి కూడా ఆసక్తి చూపుతూ ఉంటారు ప్రేక్షకులు. ఇక ఆ రేంజ్ లో అటు ఫుట్బాల్ ఆట కి కూడా మన దేశంలో క్రేజ్ ఉంది అని చెప్పాలి. ముఖ్యంగా ఫుట్బాల్ ఆటను ఆరాధించే ప్రేక్షకులు కేరళలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు అని చెప్పాలి.

 మరీ ముఖ్యంగా అటు అర్జెంటీనా, పోర్చుగల్ జట్టును ఎక్కువగా ఆరాధిస్తూ ఉంటారు కేరళలో ఉండే ఫుడ్ బాల్ ప్రేక్షకులు. ఈ క్రమంలోనే ఇక తమ అభిమాన జట్టుకు మద్దతు తెలిపేందుకు అభిమానులు చేసే కొన్ని కొన్ని పనులు అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఉంటాయి. గతంలో స్టార్ ఫుట్బాల్  ప్లేయర్ మెస్సి కి సంబంధించిన భారీ కటౌట్ ను ఏర్పాటు చేయడం వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. అయితే ఇటీవల ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లో ఫ్రాన్స్ ను ఓడించిన అర్జెంటీనా జట్టు ఇక వరల్డ్ కప్ విజేతగా నిలిచింది అన్న విషయం తెలిసిందే.

 ఈ క్రమంలోనే కేరళలో ఉన్న ఎంతోమంది అర్జెంటీనా జట్టు అభిమానులు ఆనందంలో మునిగిపోయారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే ఇక తమ అభిమాన జట్టు గెలిచింది మన ఆనందాన్ని కొంతమంది భిన్నంగా సెలబ్రేట్ చేసుకున్నారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే  కేరళలోని త్రిషూర్ జిల్లా పల్లిమూలలో ఉండే శిబు అనే వ్యక్తి హోటల్ ఓనర్ కావడం గమనార్హం. దీంతో తన అభిమాన అర్జెంటీనా జట్టు గెలవడంతో ఏకంగా వెయ్యి బిర్యానీలు ఉచితంగా పంచుతానని హామీ ఇచ్చాడు. అయితే హోటల్ వద్ద జనం ఎక్కువగా ఉండడంతో ఇక 1500 బిర్యానీలు ఉచితంగా పంచి అర్జెంటినాపై తనకున్న అభిమానాలు చాటుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: