ఇండియా టూర్ కి విలియమ్సన్ డుమ్మా.. కారమేంటో తెలుసా?

praveen
2023 ఐపీఎల్ సీజన్ కి ముందు వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో ఎంతో బిజీ బిజీగా గడుపుతుంది టీమిండియా . ఈ క్రమంలోనే ఒకవైపు విదేశీ పర్యటనలకు వెళ్లి ఇక విదేశీ గడ్డపై మూడు ఫార్మాట్లలో సిరీస్ ఆడడమే కాదు అటు భారత పర్యటనకు వస్తున్న విదేశీ జట్లతో కూడా హోరాహోరీగా వైపాక్షిక సిరీస్లలో తలబడుతూ ఉంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే ప్రస్తుతం బంగ్లాదేశ్ పర్యటనలో భాగంగా వన్డే సిరీస్ ముగించుకున్న టీమిండియా జట్టు టెస్టు సిరీస్ ఆడుతుంది. ఇక ఈ టెస్ట్ సిరీస్ ముగిసిన వెంటనే కొత్త ఏడాది కూడా నిర్విరామంగా క్రికెట్ ఆడేందుకు సిద్ధమైంది అన్న విషయం తెలుస్తుంది.

 ఈ క్రమంలోనే ఇక కొత్త ఏడాదిలో భారత్ ర్యటనకు అటు న్యూజిలాండ్ జట్టు రాబోతుంది అన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ పర్యటనలో భాగంగా మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ తో పాటు మూడు టీ20ల సిరీస్ కూడా ఆడబోతుంది న్యూజిలాండ్ జట్టు. ఇకపోతే ఇలా భారత పర్యటనకు రాబోతున్న వన్డే సిరీస్ కోసం న్యూజిలాండ్ జట్టును ప్రకటించింది ఆ దేశ క్రికెట్ బోర్డు. ఈ క్రమంలోనే ఏకంగా కెప్టెన్ కేఎన్ విలియన్స్, స్టార్ ఫేసర్ టీమ్ సౌదీ, హెడ్ కోచ్ గారి స్టేడ్ లేకుండానే వన్డే జట్టు భారత్ లో పర్యటించడానికి సిద్ధమైంది అన్నది తెలుస్తుంది. ఇక ఈ ముగ్గురు కూడా భారత్ కంటే ముందు పాకిస్తాన్తో జరిగే మూడు మ్యాచ్ల వన్డే సిరీస్ లో పాల్గొని అటు నుంచి అటే న్యూజిలాండ్ వెళ్లిపోతారట.

 అయితే ఫిబ్రవరిలో అటు ఇంగ్లాండ్  న్యూజిలాండ్ పర్యటనకు రాబోతుంది. ఈ క్రమంలోనే టెస్ట్ సిరీస్ ఆడపోతుంది. ఈ టెస్ట్ సిరీస్ ను పరిగణలోకి తీసుకొని ఇక వర్క్ లోడ్ తగ్గించేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు అన్నది తెలుస్తుంది. అయితే కేన్ విలియమ్స్ అని ప్రస్తుతం జట్టుకు అందుబాటులో లేకపోవడంతో టామ్ లాథమ్ ఇక న్యూజిలాండ్ జట్టు కెప్టెన్సీ చేపట్టబోతున్నారు అని చెప్పాలి. హెడ్ కోచ్ గారి స్టేడ్ స్థానంలో అసిస్టెంట్ కోచ్ లుక్ రాంచి బాధ్యతలు చేపట్టబోతున్నాడు. కాగా భారత పర్యటనలో భాగంగా జనవరి 18, 21, 24 తేదీలలో వన్డే సిరీస్.. 27, 29, ఫిబ్రవరి 1 తేదీల్లో టి20 సిరీస్ జరగబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: