పాకిస్తాన్ కు చుక్కలు చూపించిన "18 ఏళ్ళ కుర్రాడు" !

VAMSI
ఇంగ్లాండ్ మరియు పాకిస్తాన్ ల మధ్యన పాక్ వేదికగా మూడు టెస్ట్ ల సిరీస్ జరుగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు టెస్ట్ లు ముగిశాయి రెండింటిలోనూ పర్యాటక ఇంగ్లాండ్ గెలిచి సిరీస్ ను కైవసం చేసుకుంది. ఇక ఆఖరిదైన మూడవ టెస్ట్ లోనూ పరాజయం దిశగా పాకిస్తాన్ వెళుతోంది. మొదట టాస్ గెలిచిన పాక్ కెప్టెన్ బాబర్ ఆజామ్ బ్యాటింగ్ తీసుకున్నాడు. కేవలం 304 పరుగులు చేసి పాక్ ఆల్ అవుట్ అయింది, బాబర్ ఆజామ్ 78 పరుగులు మరియు అఘా సల్మాన్ 56 పరుగులు అత్యధిక స్కోర్ లు నమోదు చేశారు. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో జాక్ లీచ్ 4, రెహాన్ అహ్మద్ 2 వికెట్లు తీసుకుని పాక్ ను కట్టడి చేశారు.
అనంతరం ఇంగ్లాండ్ మొదటి ఇన్నింగ్స్ లో 354 పరుగులు చేసి పరుగుల మొదటి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందుకుంది. బ్రూక్ 111 పరుగులు సెంచరీ చేయగా, పొప్ (51) మరియు ఫోక్స్ (64) లు అర్ద సెంచరీలతో రాణించారు. పాక్ బౌలర్లలో అబ్రార్ అహ్మద్ 4 మరియు నౌమాన్ అలీ 4 వికెట్లు తీసుకున్నారు. పాకిస్తాన్ 50 పరుగుల లోటుతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయగా కేవలం 216 పరుగులకే ఆల్ అవుట్ అయింది. రెండవ ఇన్నింగ్స్ లో మాత్రం జోరు మీదున్న బాబర్ అజాం మరియు షకీల్ ల జోడీని విడదీసి పాక్ పతనానికి నాంది పలికాడు కెరీర్ ఓ తొలి మ్యాచ్ ఆడుతున్న రెహాన్ అహ్మద్.
ఇతనికి ప్రస్తుతం వయసు కేవలం 18 సంవత్సరాలే... ఆడుతున్నది మొదటి టెస్ట్ అయినప్పటికీ తనదైన పదునైన లెగ్ స్పిన్ డెలివరీలతో పాక్ ఆటగాళ్లను ముప్పతిప్పలు పెట్టాడు. మొదటి ఇన్నింగ్స్ లో రెండు వికెట్లు మాత్రమే తీసినా , రెండవ ఇన్నింగ్ లో మాత్రం బాబర్ అజాం 54, షకీల్  53, రిజ్వాన్ 7, అఘా సల్మాన్ 21, మహమ్మద్ వసీం జూనియర్ 2 లను అవుట్ చేసి కెరీర్ లో మొదటి మ్యాచ్ లోనే ఫైఫర్ ను సాధించి ఇంగ్లాండ్ విజయానికి బాటలు వేశాడు.    

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: