ఇండియా vs ఆస్ట్రేలియా: చావో రేవో... గెలిస్తేనే సిరీస్ ఆశలు సజీవం !

VAMSI
మహిళల ఆస్ట్రేలియా టీం ప్రస్తుతం ఇండియా పర్యటనలో ఉంది. ఈ టూర్ లో ఇరు జట్ల మధ్యన అయిదు టీ 20 ల సిరీస్ జరగనుంది. కానీ ఇప్పటికే మూడు మ్యాచ్ లు ముగిశాయి, కాగా విజిటర్స్ ఆస్ట్రేలియా మహిళలు సిరీస్ లో 2-1 తో ముందంజలో ఉన్నారు. ఇక మిగిలి ఉన్న రెండు మ్యాచ్ లలో ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్ గెలిస్తే సిరీస్ ను సొంతం చేసుకుంటుంది. అయితే ఇండియా సిరీస్ ను గెలుచుకోవాలంటే వరుసగా రెండు మ్యాచ్ లలోనూ గెలవాల్సి ఉంది. కానీ ఆస్ట్రేలియా అన్ని విభాగాలలోనూ ఇండియా కన్నా బలంగా ఉండడంతో సిరీస్ ను చేజిక్కించుకోవడం కాస్త కష్టమే అని చెప్పాలి. అయితే ఇండియా ప్లేయర్స్ అందరూ తమను తాము నమ్ముకుని రాణిస్తే ఖచ్చితంగా సిరీస్ ను పొందే అవకాశం ఉంది.
వాస్తవంగా ఇండియా మహిళలకు ఇది చావో రేవో మ్యాచ్. పిచ్ స్వభావాన్ని బట్టి చూస్తే మరోసారి బ్రబౌర్న్ స్టేడియం ముంబైలో పరుగుల వరద తప్పేలా లేదు. ముందుగా టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇక గత మ్యాచ్ లో వచ్చిన స్పిన్నర్ రాజేశ్వరి గైక్వాడ్ ను ఈ మ్యాచ్ లో తప్పించి బ్యాట్స్మన్ హర్లీన్ డియోల్ జట్టులోకి తీసుకోవడం జరిగింది. గడిచిన మూడు మ్యాచ్ లలోనూ ఇరు ఆస్ట్రేలియా 170 ప్లస్ స్కోర్ చేసింది. ఈ మ్యాచ్ లో తమకున్న బాటింగ్ బలానికి ఖచ్చితంగా పరుగులు చేసే అవకాశాన్ని కొట్టిపారేయలేము.
ఇక ఇండియా ఈ మ్యాచ్ లో గెలవాలంటే ఎప్పటిలాగే స్మృతి మందన్న , షెఫాలీ వర్మ , హర్మన్ ప్రీత్ కౌర్, రిచా ఘోష్ లు అంచనాలకు తగిన విధంగా కనుక రాణిస్తే సులభంగా ఆస్ట్రేలియా ఎంత స్కోర్ టార్గెట్ గా ఇచ్చినా చేధించవచ్చు. మరి చూద్దాం ఈ సిరీస్ లో ముందుకు వెళ్లాలంటే గెలవాల్సిన మ్యాచ్ లో ఏ విధంగా రాణిస్తుంది అన్నది చూడాలి.
 

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: