బ్యాటింగ్ విధ్వంసం.. అతని విషయంలో ధోని లెక్క తప్పాడా?

praveen
సహచర ఆటగాళ్ల తో పాటు ప్రత్యర్థి ప్లేయర్లను రీడ్ చేయడం లో మహేంద్ర సింగ్ ధోనీ దిట్ట అని చెబుతూ ఉంటారు నిపుణులు. ఇక తన వ్యూహాల తో ప్రత్యర్థి ఆటగాళ్లను  బోల్తా కొట్టించడంలో ఇక ధోని కంటే తెలివైన ఆటగాడు మరొకరు లేరు అని అంటూ ఉంటారు. ఇక ఏ ఆటగాడు ఎలాంటి ప్రదర్శన చేస్తాడు అన్న విషయాన్ని ధోని ముందు గానే ఒక అంచనాకు వస్తూ ఉంటాడు అని చెప్పాలి. కానీ అలాంటి మహేంద్ర సింగ్ ధోని ఒక ఆటగాడు విషయం లో మాత్రం లెక్క తప్పాడు అన్నది అర్థమవుతుంది.

 ఏకంగా డైమండ్ లాంటి ప్లేయర్ ను సొంత జట్టు నుంచి వదులు కొని ఇక ఇప్పుడు ధోని ఎంతగానో బాధపడి పోతున్నాడు అన్నది మాత్రం అర్థం అవుతుంది. ఇలా ధోనిని లెక్క తప్పించిన ప్లేయర్ ఎవరో కాదు నారాయన్ జగదీషన్ విజయ్. హజారే ట్రోఫీ లో భాగంగా జగదిషన్ తన బ్యాటింగ్ విధ్వంశాన్ని కొనసాగిస్తున్నాడు అని చెప్పాలి. ఏకంగా ఇప్పటి వరకు ఐదు సెంచరీలు బాదిన ఎన్నో రికార్డులను బద్దలు కొట్టాడు ఈ తమిళనాడు ప్లేయర్.

 ఇప్పటికే విజయ్ హజారే ట్రోఫీ లో భాగం  గా నాలుగు సెంచరీలు సాధించి అదరగొట్టిన నారాయన్ జగదీషన్ ఇటీవల హైదరాబాద్ తో జరిగిన మ్యాచ్లో మరోసారి బ్యాట్ ఝలిపించాడు  అని చెప్పాలి. 97 బంతుల్లోనే  116 పరుగులు చేశాడు జగదీషన్. అంతకుముందు అరుణాచల్ ప్రదేశ్ తో జరిగిన మ్యాచ్లో 141 బంతుల్లోనే మెరుపు ఇన్నింగ్స్ తో 277 పరుగులు చేసి అదరగొట్టాడు అన్న విషయం తెలిసిందే. ఇలా సెంచరీలతో చెలరేగిపోతున్న జగదీషన్ ను  ఇటీవల రిటైన్ చేసుకోకుండా మెగా వేలంలోకి వదిలేసింది చెన్నై జట్టు. దీంతో జగదీషన్ విషయంలో ధోని లెక్క తప్పాడు అంటూ ఎంతోమంది క్రికెట్  నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: