బంగ్లాదేశ్ ను ఫాలో ఆన్ ఆడించకపోవడానికి అసలు కారణం ఇదే !

VAMSI
చట్టోగ్రామ్ టెస్ట్ లో ఇండియా మొదటి ఇన్నింగ్స్ లో 404 పరుగులు చేసి బంగ్లాను ఒత్తిడిలోకి నెట్టాలనే ప్రయాతం సఫలం అయిందని చెప్పాలి. బంగ్లాదేశ్ తమ మొదటి ఇన్నింగ్స్ లో కేవలం 150 పరుగులకే అల్ అవుట్ అయింది. నిన్న 2 వికెట్ల కొరతతో ఇన్నింగ్స్ ప్రారంభించిన ఇండియా మరో 17 పరుగులు మాత్రమే ఇచ్చి బంగ్లా బ్యాటింగ్ ను ముగించింది. బంగ్లా తరపున మెహిదీ హాసన్ మిరాజ్ ఒక్కడే 25 పరుగులతో టాప్ లో నిలిచాడు. ఇక ఇండియన్ బౌలర్ లలో మిస్టరీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాసించాడు, పేసర్ సిరాజ్ 3 , ఉమేష్ యాదవ్ 1 మరియు అక్షర్ పటేల్ 1 వికెట్ తీసుకున్నారు.
కుల్దీప్ యాదవ్ తన కెరీర్ లో 8 టెస్ట్ లు మాత్రమే ఆడగా మూడు ఫైఫర్ లు సాధించడం విశేషం. ఇక మరో స్పిన్నర్ అశ్విన్ ఓవర్లు బౌలింగ్ వేసినా ఒక్క వికెట్ ను కూడా దక్కించుకోలేకపోయాడు. నిన్న క్రికెట్ ప్రముఖులు ఊహించిన విధంగా ఈ రోజు ఇండియా బంగ్లాను త్వరగా అల్ అవుట్ చేసి ఫాలో ఆన్ ఆడిస్తుంది అనుకున్నారు. కానీ మొదటి ఇన్నింగ్స్ లో బంగ్లా అల్ అవుట్ అయిన తర్వాత  254 పరుగుల ఆధిక్యం ఉండి కూడా ఇండియా కెప్టెన్ కె ఎల్ రాహుల్ ఫాలో ఆన్ ను ఎందుకు ఆడించలేదు అన్న విషయం సోషల్ మీడియాలో చర్చగా మారింది.
వాస్తవంగా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో ఫైనల్ కు చేరుకోవడానికి పాయింట్లను మెరుగుపరుచుకోవడం చాలా అవసరం. అలాంటప్పుడు ఇలా చిన్న చిన్న జట్లపై ఫాలో ఆన్ లను ఆడించి తద్వారా మొదటి ఇన్నింగ్స్ విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంటే టెస్ట్ ఛాంపియన్ షిప్ కు మార్గం సులభం అవుతుంది. ఇది తెలిసి కూడా ఇండియా యాజమాన్యం ఇలాంటి నిర్ణయం ఎలా తీసుకుంది అన్నది ఇప్పడు హాట్ టాపిక్ అయింది. కానీ ఇక్కడ కె ఎల్ రాహుల్ ఆలోచించిన ప్రకారం ప్రస్తుతం పిచ్ బ్యాటింగ్ కు బాగా అనుకూలిస్తోంది. రెండవ ఇన్నింగ్స్ లో బంగ్లా కనుక బాగా ఆడి భారీగా పరుగులు చేస్తే ఇండియా ఒత్తిడిలో పడే అవకాశం ఉందని ఫాలో ఆన్ ఆడించలేదట.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: