సచిన్ కొడుకా మజాకా.. మళ్లీ అదే రిపీట్ చేశాడు?

praveen
సచిన్ టెండూల్కర్ వారసుడిగా భారీ అంచనాల మధ్య క్రికెట్లోకి అరంగేట్రం చేసిన అర్జున్ టెండూల్కర్ ఎక్కడ అంచనాలను అందుకునే ప్రదర్శన చేయలేదు అని చెప్పాలి. ఎంతోమంది యువ ఆటగాళ్లు సత్తా చాటుతూ అటు రంజీ ట్రోఫీ సహా మరికొన్ని దేశవాళి టోర్నీలలో కూడా అదరగొడుతున్నారు. మరోవైపు ఐపీఎల్ లో కూడా ఛాన్స్ దక్కించుకొని ప్రతిభ చాటుతున్నారు.  కానీ అర్జున్ టెండూల్కర్ కు  రంజి ట్రోఫీలో ఛాన్స్ రాలేదు. దీంతో ముంబై నుంచి గోవా క్రికెట్ అసోసియేషన్ కూ మారాడు అర్జున్ టెండూల్కర్.

 గోవా జట్టు తరఫున రంజీల్లో బలిలోకి దిగిన అర్జున్ టెండూల్కర్ ఇక మొదటి మ్యాచ్ లోనే శతకంతో అందరిని ఆశ్చర్యపరిచాడు అని చెప్పాలి. తన ఫస్ట్ మ్యాచ్ లోనే తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు అర్జున్ టెండూల్కర్. ఇక ఇటీవల రంజీల్లో భాగంగా రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్లో గోవా తరఫున బరిలోకి దిగిన అర్జున్ టెండూల్కర్ 120 పరుగులు చేశాడు. కాగా 15 ఏళ్ల వయసులోనే రంజీల్లోకి ఎంట్రీ ఇచ్చిన సచిన్ అరంగేట్రం మ్యాచ్లోనే ఫస్ట్ సెంచరీ కొట్టాడు.  ఇక ఇప్పుడు సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ 34 ఏళ్ళ తర్వాత తండ్రి ఫీట్ను రిపీట్ చేసాడు.

 కాగా ఐపీఎల్ లో ప్రస్తుతం ముంబై ఇండియన్స్ తరఫున కొనసాగుతున్నాడు అర్జున్ టెండూల్కర్. కానీ ఇప్పటివరకు ఒక్కసారి కూడా తూది జట్టులో అవకాశం కల్పించి ఆడించలేదు. కేవలం నెట్ ప్రాక్టీస్ వరకు మాత్రమే పరిమితం అయ్యాడు. ఈ క్రమంలోనే ఎట్టకేలకు అటు మంచి అవకాశాన్ని దక్కించుకున్న అర్జున్ టెండూల్కర్ తనలో దాగి ఉన్న ప్రతిభ ఏంటో నిరూపించి అందరిని ఆశ్చర్యపరిచాడు అని చెప్పాలి. ఇక ఇలాంటి ప్రదర్శన చేస్తే ఐపీఎల్లో తుది జట్టులో కనిపించవచ్చు ఛాన్స్ ఉంది. కాగా ఈ ఏడాది జూన్లో ముంబై జట్టును వదిలేసి గోవా జట్టు కోసం నిర్వహించిన ట్రైల్స్ లో పాల్గొని సెలెక్ట్ అయ్యాడు  అర్జున్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: