స్టార్ ప్లేయర్ స్మిత్ క్యాప్.. ఎలుకలు కొరికేసాయి?

praveen
ప్రస్తుతం ఆస్ట్రేలియా జట్టులో స్టార్ బ్యాట్స్మెన్ గా కొనసాగుతూ ఉన్నాడు స్మిత్. గత కొంతకాలం నుంచి టెస్ట్ ఫార్మాట్లో అత్యుత్తమమైన ఫామ్ లో కొనసాగుతున్న స్మిత్ ఇక సెంచరీలతో చెలరేగిపోతున్నాడు అనే విషయం తెలిసిందే. ఏకంగా జట్టు విషయంలో కీలక పాత్ర వహిస్తూ తన అద్భుతమైన ఫాంతో ప్రేక్షకులు అందరిలో కూడా ఉత్సాహాన్ని నింపుతూ ఉన్నాడు అని చెప్పాలి. ఇకపోతే గతంలో కెప్టెన్ గా ఉండి ఇక బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా నిషేధం ఎదురుకున్న స్మిత్ ఇప్పుడు ఆస్ట్రేలియా టెస్ట్ జట్టుకి వైస్ కెప్టెన్ గా కొనసాగుతున్నాడు.

 ప్రస్తుతం ఫ్యాట్ కమిన్స్ కెప్టెన్సీలో వెస్టిండీస్ తో టెస్ట్ సిరీస్ ఆడుతున్న ఆస్ట్రేలియా జట్టు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంటుంది. మొదటి టెస్ట్ మ్యాచ్ లో భాగంగా కొన్ని పరుగుల తేడాతో గెలిచిన ఆస్ట్రేలియా.. స్మిత్ కెప్టెన్సీ లో జరిగిన రెండవ టెస్టులో 419 పరుగుల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది. ఇక ఆస్ట్రేలియా గెలిచిన తర్వాత టెస్ట్ సిరీస్ అందుకునే క్రమంలో స్మిత్ ధరించిన చిల్లులు పడిన టోపీ కాస్త కెమెరాల దృష్టిని తెగ ఆకర్షించింది అని చెప్పాలి. ఏకంగా పాడైపోయి చెత్త కుప్పలో పడేసిన టోపీని వెతికి మరి తీసుకొచ్చినట్లుగా ఇక స్మిత్ పెట్టుకున్న టోపీ ఉంది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే చిల్లులు పడిన టోపీ పెట్టుకోవడంపై స్టీవ్ స్మిత్ స్పందించాడు. డ్రెస్సింగ్ రూమ్ లో ఎప్పటిలాగానే నా టోపీ పెట్టి వెళ్లిపోయాను. కానీ తర్వాత రోజు వచ్చి చూస్తే ఎలుకలు కొరికేసినట్లు తెలిసింది. అయితే టోపీ చివరికి ఇలా తయారయింది. ఇక వచ్చేవారం దీన్ని బాగు చేయిస్తాను. అంతేకానీ పడేయను అంటూ స్మిత్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే అటు రెండవ టెస్ట్ మ్యాచ్ ను కెప్టెన్ గా  భారీ తేడాతో గెలిపించిన స్మిత్ ఆటగాడిగా మాత్రం విఫలమయ్యాడు. కానీ మొదటి మ్యాచ్ లో మాత్రం డబుల్ సెంచరీ తో అదరగొట్టాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: