అదే జరిగితే.. ధావన్ కెరియర్ ముగిసినట్లే : దినేష్ కార్తీక్

praveen
ప్రస్తుతం టీమిండియా తరఫున సీనియర్ బాట్స్మన్ గా కొనసాగుతున్నాడు శిఖర్ ధావన్. అయితే మొన్నటి వరకు మూడు ఫార్మట్లలో కూడా అవకాశాలు దక్కించుకున్నాడు అని చెప్పాలి. కానీ ఇక గత కొంతకాలం నుంచి మాత్రం టీమ్ ఇండియాలో యువ ఆటగాళ్ల మధ్య పోటీ ఎక్కువైన నేపథ్యంలో  సీనియర్ ప్రేయర్ అయిన శిఖర్ ధావన్ కు సరైన అవకాశాలు దక్కడం లేదు. ఒకవేళ దక్కిన కేవలం వన్డే ఫార్మాట్లో మాత్రమే అవకాశాలను చేజిక్కించుకుంటున్నాడు శిఖర్ ధావన్.

 అయితే ఇలా గత కొంతకాలం నుంచి కేవలం వన్డేలకు మాత్రమే పరిమితమైన శిఖర్ ధావన్ రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేస్తున్నాడు అన్న విషయం తెలిసిందే. అయితే వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడంలో మాత్రం విఫలమవుతున్నాడు. ఎందుకో చెప్పుకోదగ్గ ప్రదర్శనలు మాత్రం చేయలేక పోతున్నాడు శిఖర్ ధావన్. మునుపటిలా జట్టుకు శుబారంబాలు ఇవ్వలేక పోతున్నాడు. ఇలాంటి సమయంలో ఇటీవల రోహిత్ గాయపడటంతో జట్టులోకి వచ్చిన ఇషాన్ కిషన్ డబుల్ సెంచరీ తో చెలరేగి పోయాడు.

 ఈ క్రమం లోనే టీమ్ ఇండియా ఆడే వన్డే సిరీస్ లో ఇషాన్ కిషన్ ను తప్పకుండా సెలెక్ట్ చేయాలి అనే ఒత్తిడిని సెలెక్టెర్లపై తీసుకోవచ్చాడు. ఇలాంటి క్రమం లోనే అటు దినేష్ కార్తీక్ శిఖర్ ధావన్ కెరియర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.. బంగ్లాదేశ్ సిరీస్లో ధావన్ విఫల మయ్యాడు. ఇషాన్ కిషన్, గిల్ అద్భుతంగా రానించారు. అయితే రోహిత్ అందు బాటులోకి వస్తే ఎవరో ఒకరు జట్టుకు దూరం కావాలి. ఈ క్రమం లోనే ఇషాన్ కిషన్, గిల్ ఫామ్  ఉన్నారు.. దీంతో ధావన్  జట్టుకు దూరమవుతాడేమో అనిపిస్తుంది. ఇదే జరిగితే ధావన్ కెరీర్ కు బాధాకరమైన ముగింపు తప్పితేమో.. ఇక శిఖర్ ధావన్ కు ప్రపంచకప్ లో చోటు కష్టమే అంటూ వ్యాఖ్యానించాడు దినేష్ కార్తీక్.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: