మరుపురాని విజయం.. తల్లితో కలిసి డాన్స్ చేసిన స్టార్ ప్రేయర్?

praveen
ప్రస్తుతం ఎంత ఉత్కంఠ భరితంగా జరుగుతున్న పిపా ప్రపంచ కప్ లో భాగంగా ఎన్నో సంచలన నమోదు అవుతున్నాయ్. స్టార్ ప్లేయర్లతో నిండిపోయిన ఎన్నో పటిష్టమైన జట్లు టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగితే మరికొన్ని జట్లు అదే సమయంలో ఎప్పటిలాగానే సాధారణ ప్రస్తానాన్ని కొనసాగిస్తాయని అందరూ భావించారు  కానీ ఊహించని రీతిలో అందరి అంచనాలు తారు మారు అవుతున్నాయి. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన జట్లు ఓటములతో అటు టోర్నీ నుంచి నిష్క్రమిస్తూ  ఉంటే ఇక లీక్ దశ నుంచి టోర్నీ నుంచి నిష్క్రమిస్తాయి అనుకున్న జట్లు మాత్రం వరుస విజయాలతో ముందుకు దూసుకుపోతున్నాయని చెప్పాలి.

 ఈ క్రమంలోనే స్టార్ ప్లేయర్లు జట్టులో ఉన్నప్పటికీ కూడా ఇక కొన్ని జట్లకు టోర్నీ నుంచి నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. ఇక ఇటీవల ఫిఫా వరల్డ్ కప్ లో భాగంగా మొరాకో జట్టు తిరుగులేని విజయాన్ని సాధించి చరిత్ర సృష్టించింది. ఏకంగా దిగ్గజ పోర్చుగల్ పై విజయాన్ని అందుకుని సెమీఫైనల్ లో అడుగు పెట్టింది అని చెప్పాలి. ఇక ఈ విజయం మొరాకో ఆటగాళ్ళకి ఎంతో పెద్దది ఎంతో ప్రత్యేకమైనది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ క్రమంలోనే ఈ అద్భుతమైన విజయాన్ని ఎంతో ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు జట్టులోని ఆటగాళ్లు.

 ఇక మొరకో జట్టు కోసం వింగర్ లేదా అటాకింగ్ మీట్ ఫీల్డర్ గా ఆడే సోఫీ బౌపాల్ ఈ విజయాన్ని తన తల్లితో కలిసి సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారిపోయింది అని చెప్పాలి. బౌపాల్, అతని తల్లి మ్యాచ్ ముగిసిన తర్వాత మైదానంలో డాన్స్ చేయడం ఇక వైరల్ గా మారిపోయిన వీడియోలో చూడవచ్చు. ఈ క్రమంలోనే ఈ వీడియో అటు ఫుట్బాల్ ప్రేక్షకులందరికీ కూడా ఎంతగానో ఆకర్షిస్తుంది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: