ఫిఫా వరల్డ్ కప్ లో మరో సంచలనం.. ఫ్యాన్స్ షాక్?

praveen
ఖాతార్ వేదికగా ప్రారంభమైన ఫిఫా వరల్డ్ కప్ లో ప్రతి మ్యాచ్ కూడా ప్రస్తుతం ఎంత ఉత్కంఠ భరితంగా జరుగుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ప్రస్తుతం నాకౌట్ మ్యాచ్ లు నువ్వా నేనా అన్నట్లుగానే జరుగుతున్నాయి. అయితే ఈ ఏడాది ఫిఫా వరల్డ్ కప్ ఎన్నో సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది అని చెప్పాలి. ఎందుకంటే ప్రేక్షకుల ఊహ కందని ఫలితాలు ప్రతి మ్యాచ్లో కూడా వస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన  జట్లు ఏవి కూడా పెద్దగా ఆకట్టుకునే ప్రదర్శన చేయలేకపోతున్నాయి.

 అసలు టైటిల్ పోరులో ఎక్కడ నిలబడలేవు అనుకున్న జట్లే అద్భుతంగా రాణిస్తూ ఇక మునుమందుకు దూసుకుపోతూ ఉండడం గమనార్హం. దీంతో ప్రేక్షకుల ఊహకంగా ఫలితాలు వస్తున్న నేపథంలో అందరూ కూడా మరింత ఉత్సాహంగా మ్యాచ్ ను వీక్షించేందుకు సిద్ధమవుతున్నారు అని చెప్పాలి. మొన్నటికి మొన్న ఏకంగా ఫిఫా వరల్డ్ కప్ లో ఐదు సార్లు ఛాంపియన్ అయినా బ్రెజిల్ జట్టు పసికూన చేతిలో ఓడిపోయి టోర్నీ నుంచి నిష్క్రమించడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది.

 ఇక ఇప్పుడు మరోసారి ఇలాంటి సంచలనమే నమోదయింది అని చెప్పాలి. ఏకంగా టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన పోర్చుగల్ జట్టు ఇటీవల ఓటమి పాలు అయింది. ఇటీవల క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో మొరాకొ చేతిలో పోర్చుగల్ జట్టు ఓడిపోయింది. 1-0 గోల్ తేడాతో మొరాకో విజయం సాధించింది. దీంతో ప్రపంచ కప్ నుంచి పోర్చుగల్ జట్టు టోర్ని నిష్క్రమించాల్సిన పరిస్థితి ఏర్పడింది అని చెప్పాలి. దీంతో ఇక పోర్చుగల్ జట్టుకు కెప్టెన్ గా ఉన్న క్రిస్టియానో రోనాల్డో కన్నీరు మున్నీరు అయ్యాడు. అయితే ఇక ఇటీవల గెలిచిన మొరాకో జట్టు సెమీఫైనల్ లో అడుగుపెట్టిన తొలి ఆఫ్రికన్ దేశంగా కూడా రికార్డు సృష్టించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: