భారత్లో శ్రీలంక పర్యటన.. పూర్తి డీటెయిల్స్ ఇవే?

praveen
గత కొంతకాలం నుంచి భారత జట్టు నిర్వీరామంగా క్రికెట్ ఆడుతూనే ఉంది అన్న విషయం తెలిసిందే. ఒకవైపు ద్వైపాక్షిక సిరీస్ లతో పాటు మరోవైపు ఆసియా కప్ వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలలో కూడా ఆడుతూ ఇక ఎంతో బిజీబిజీగా గడుపుతుంది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే ఈ ఏడాది ద్వైపాక్షిక సిరీస్లలో బాగా రానించిన టీమ్ ఇండియా జట్టు అటు ఆసియా కప్ వరల్డ్ కప్ లాంటి మెగాటోర్నీలలో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇక ఈ రెండు టోర్ని లలో అద్భుతంగా రాణిస్తుంది అనుకున్నప్పటికీ ప్రేక్షకులకు నిరాశ ఎదురయింది అని చెప్పాలి.

 ఈ క్రమంలోనే భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ కళ్ళు కూడా ఇక వచ్చే యేడాది భారత్ వేదికగా ప్రారంభం కాబోయే వన్డే వరల్డ్ కప్ పైనే ఉన్నాయి అని చెప్పాలి. ఎందుకంటే ఇక ఈ వరల్డ్ కప్ లో విజయం సాధించి నిరీక్షణకు టీమిండియా తెరదింపుతుందని ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు. ఇది ఇలా ఉంటే ఇక ఈ ఏడాది మాత్రమే కాదు వచ్చే ఏడాది కూడా టీమిండియా వరుసగా ద్వైపాక్షిక సిరీస్ లతో బిజీబిజీగా ఉంది అని చెప్పాలి. కొత్త సంవత్సరంలో మొదటి వారం నుంచే ద్వైపాక్షిక సిరీస్ లు ఆడబోతుంది టీమిండియా. ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభానికి  ముందు వరకు కూడా నిర్విరామంగా క్రికెట్ ఆడబోతుంది అని చెప్పాలి. ఈ క్రమంలోనే జనవరి 3వ తేదీ నుంచి భారత పర్యటనకు రాబోతుంది ఆస్ట్రేలియా జట్టు.

 ఈ క్రమంలోనే 3 వన్డేల సిరీస్ తో పాటు ఇక అటు 3 టి20 మ్యాచ్ల సిరీస్ కూడా ఆడబోతుంది అని చెప్పాలి. ఇకపోతే శ్రీలంక భారత పర్యటనలో భాగంగా ఒకసారి షెడ్యూల్ చూసుకుంటే... భారత్ శ్రీలంక మధ్య జనవరి మూడవ తేదీన తొలి టి20 మ్యాచ్ ముంబై వేదికగా జరగబోతుంది. జనవరి 5వ తేదీన రెండవ టి20 మ్యాచ్ పూనే వేదికగా జరగనుంది. జనవరి 7వ తేదీన మూడవ టి20 మ్యాచ్ కు రాజ్కోట్ ఆతిథ్యం ఇస్తుంది అని చెప్పాలి. ఇక ఆ తర్వాత రెండు రోజుల గ్యాప్ లోనే వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. జనవరి 10 తేదీన తొలి వన్డే మ్యాచ్ గౌహతి వేదికగా, జనవరి 12వ తేదీన రెండో వన్డే మ్యాచ్ కోల్కతా వేదికగా, జనవరి 15వ తేదీన మూడో వన్డే మ్యాచ్ త్రివేండ్రం వేదికగా జరగబోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: